Kumaram Bheem Asifabad: ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2023-12-10T22:11:44+05:30 IST
రెబ్బెన, డిసెంబరు 10: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమని, మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ
రెబ్బెన, డిసెంబరు 10: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమని, మానవతా దృక్పథంతో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు 15లక్షల మంది ఉన్నారని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు చేపట్టడంతో ఆటోలు నడిపే వారి పరిస్థితి ఆర్థికంగా దెబ్బ తింటుందన్నారు. సమావేశంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు బొంగు నరసింగరావు, మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర్, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.