Kumaram Bheem Asifabad: నామినేషన్‌కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు
ABN , First Publish Date - 2023-11-10T22:24:29+05:30 IST
సిర్పూర్(టి), నవంబరు 10: మండల కేంద్రంలోని నామినేషన్‌కేంద్రాన్ని శుక్ర వారం జిల్లా ఎన్నికల జనరల్ పరిశీలకుడు రాజేష్‌రంజన్, పోలీసు పరిశీలకుడు డీకే చౌదరి, కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి పరిశీలించారు.
సిర్పూర్(టి), నవంబరు 10: మండల కేంద్రంలోని నామినేషన్‌కేంద్రాన్ని శుక్ర వారం జిల్లా ఎన్నికల జనరల్ పరిశీలకుడు రాజేష్‌రంజన్, పోలీసు పరిశీలకుడు డీకే చౌదరి, కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నామినేషన్ కేంద్రం వద్ద భద్రత ఏర్పాటుకు సంబంధించిన వివరాలను పరిశీలకులకు వివరించారు. నామినేషన్ కేంద్రం నుంచి వంద మీటర్ల దూరం వరకు బారికేడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడానికి జిల్లాలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ కరుణాకర్, సీఐ సాదిక్ పాషా, ఎస్సై దీకొండ రమేష్ తదితరులు ఉన్నారు.