Kumaram Bheem Asifabad: విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Dec 17 , 2023 | 10:47 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 17: జిల్లాలోని విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తామని బీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన పెన్షనర్స్‌డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 17: జిల్లాలోని విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి కృషి చేస్తామని బీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన పెన్షనర్స్‌డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెని ఫిట్స్‌ని సక్రమంగా అందేలా చూస్తామన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తేవాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం ఇటీవల పదవీవిరమణ చెందిన ఉద్యోగులస్థులను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్, విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కరుణాకర్‌గౌడ్, సుభాష్, శంకర్, వెంకన్న, అచ్యుత్‌రావు తదితరులు పాల్గొన్నారు.