Kumaram Bheem Asifabad: కొలాం, తోటి, పీవీటీల అభివృద్ధికి కృషిచేయాలి
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:24 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 22: కొలాం, తోటి, పీవీటీజీల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, దాసరి వేణు, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖాధికారి రమాదేవితోకలిసి జిల్లాలోని వివిధశాఖల అధికారులతో కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్‌మన్‌పథకం నిర్వహణపై సమీక్ష నిర్వహిం చారు.
- కలెక్టర్ హేమంత్ బోర్కడే
ఆసిఫాబాద్, డిసెంబరు 22: కొలాం, తోటి, పీవీటీజీల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, దాసరి వేణు, జిల్లా గిరిజన అభివృద్ధి శాఖాధికారి రమాదేవితోకలిసి జిల్లాలోని వివిధశాఖల అధికారులతో కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్‌మన్‌పథకం నిర్వహణపై సమీక్ష నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేవ పెట్టిన ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో జిల్లాలో 149పీవీటీజీ గ్రామాల్లో చేపట్టాల్సిన పక్కా గృహాలు,రహదారులు, ఇంటర్నెట్‌సేవలు, విద్యుత్, తదితరపనులు చేపట్టడా నికి అవసరమైన నివేదికలు రూపొందించి త్వరగా అందజేయాలని తెలిపారు. కనీసం 50పీవీటీజీ గ్రామాల్లో మల్టీపర్సన్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జనాభా ఆధారంగా ఎలాంటి వివాదాలు లేని వెయ్యి పీఈటీజీల కొరకు జన్‌ధన్ బ్యాంకు ఖాతా తెరిచేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవన్నారు. వచ్చే జనవరి 15న లబ్ధి దారులతో ప్రధానమంత్రి మాట్లాడే కార్యక్రమం ఉన్నందున అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.