Kumaram Bheem Asifabad: మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Dec 24 , 2023 | 10:47 PM
కాగజ్‌నగర్, డిసెంబరు 24: కాగజ్‌నగర్ ఈసుగాంలోని శివమల్లన్న ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. పట్టణం, మండలంలోని భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకుని బోనం వండి స్వామికి నైవేద్యాలు సమర్పించారు.
కాగజ్‌నగర్, డిసెంబరు 24: కాగజ్‌నగర్ ఈసుగాంలోని శివమల్లన్న ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. పట్టణం, మండలంలోని భక్తులు ఉదయమే ఆలయానికి చేరుకుని బోనం వండి స్వామికి నైవేద్యాలు సమర్పించారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కుటు చెల్లించుకున్నారు. భక్తులు అధికంగా రావటంతో ఆలయం కిక్కిరిసిపోయింది.
బెజ్జూరు: మండలంలోని అందుగులగూడ సమీ పంలోని మల్లన్న గుట్టపై ఆదివారం షష్టి బోనాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థు లంతా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
సిద్ధేశ్వరుడికి ప్రత్యేక పూజలు
మండలంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న సిద్ధేశ్వరుడికి ఆదివారం భక్తులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వ్యవ సాయ పనులు ముగి సిన అనంతరం పంటచేతికి వచ్చిన సందర్భంగా సిద్దేశ్వరు డికి పూజలు చేయ డం ఇక్కడి ప్రజల అనవాయితీ. భక్తు లంతా భాజాభజం త్రీలతో ప్రదక్షిణలు నిర్వహించి పూజలు చేశారు.
శివాలయం వార్షికోత్సవం
కౌటాల: మండలకేంద్రంలోని సదాశివపేట శివా లయం వార్షికోత్సవాన్ని ఆదివారంఘనంగా నిర్వ హించారు. మూడురోజులపాటు నిర్వహించే వార్షి కోత్సవంలో మొదటి రోజుధ్వజారోహన, శివుడి ఆరా ధన, హారతి,గ్రామదేవతలఆరాధన, తదితర పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధానార్చకుడు తెలిపారు.