Kumaram Bheem Asifabad: కంకాలమ్మ జాతరకు పొటెత్తిన భక్తజనం
ABN , First Publish Date - 2023-12-10T22:09:47+05:30 IST
కౌటాల, డిసెంబరు 10: మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై ఆదివారం నిర్వహించిన జాతరకు భక్తజనం పొటె త్తారు. ఎటుచూసినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం గుట్ట వైపే చేరుకోవడం కనిపించింది. జాతరకు భక్తులు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహా రాష్ట్ర, చత్తీస్‌గడ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు.
- అలంరించిన నృత్యాలు, శివసత్తుల పూనకాలు
- పట్టువస్త్రాలు సమర్పించిన ప్రముఖులు
- జనసంద్రమైన కౌటాల
కౌటాల, డిసెంబరు 10: మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై ఆదివారం నిర్వహించిన జాతరకు భక్తజనం పొటె త్తారు. ఎటుచూసినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం గుట్ట వైపే చేరుకోవడం కనిపించింది. జాతరకు భక్తులు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహా రాష్ట్ర, చత్తీస్‌గడ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు. కంకాలమ్మ జాతర ప్రత్యేకత శివసత్తుల పూనకాలు, పట్నాలు. ఈ కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేల సంఖ్యలో వచ్చిన భక్తులకు ఆలయకమిటీ ఆధ్వర్యం లో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వ హించారు. జాతరలో చిన్నపిల్లల కోసం రంగులరట్నం తదితరాలు అలరించాయి. అశేష జనవాహిని కోసం పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆసిఫాబాద్ ఏఎస్పీ అచ్చేశ్వర్‌రావు, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐలు, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన ప్రముఖులు..
జాతరసందర్భంగా కంకాలమ్మ అమ్మ వారికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్ శివరామ స్వామి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, మాజీఎమ్మెల్యే పాల్వాయి రాజ్య లక్ష్మి, కౌటాలఎంపీపీ విశ్వనాథ్, తదితరులు పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.