Kumaram Bheem Asifabad: సిర్పూరు అభివృద్ధియే ప్రధాన ఎజెండా: హరీష్ బాబు
ABN , First Publish Date - 2023-12-04T22:33:11+05:30 IST
కాగజ్‌నగర్, డిసెంబరు 4: సిర్పూరు అభివృద్ధియే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తానని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిర్పూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకచర్యలు తీసుకుంటామన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
కాగజ్‌నగర్, డిసెంబరు 4: సిర్పూరు అభివృద్ధియే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తానని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిర్పూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకచర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఎన్నికల్లో తన విజయానికి దోహపదపడిన ప్రతి ఒక్క రికీ కృతజ్ఞతలు తెలిపారు. తన గెలు పుతో సిర్పూరు నియోజకవర్గం ఎన్నిక లపై రాష్ట్ర దృష్టి పడిందన్నారు. ఈ ఎన్నికల బరిలో ఇతర పార్టీల నాయకులు ఏకంగా కోట్లలో డబ్బులు కుమ్మరించినట్టు పేర్కొన్నారు. ఇంతక్లిష్ట పరిస్థితుల్లో ఆర్‌ఎస్‌ఎస్, బజరంగదళ్, బీఎం ఎస్, ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తమ వంతుగా తన గెలుపునకు స్వచ్ఛందగా కృషి చేసినట్టు తెలిపారు. బెంగాళీలంతా కూడా ఒక వైపుగా ఉండీ బీజేపీకి ఓటేసినట్టు తెలిపారు. బెంగాళీల సమస్యలు తప్ప కుండా తీరుస్తామన్నారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఆరె కులస్థుల సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. ప్రజల పక్షాన ఉంటామన్నారు. ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటా నన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీజేపీని గెల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కొంగ సత్యనారాయణ, కాళిదాస్ మండల్, ఈర్ల విశ్వేశ్వర్‌రావు, వీరభద్రాచారి, సిందం శ్రీనివాస్, దోని శ్రీశైలంతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతన ఎమ్మెల్యేకు ఘన సన్మానం..
సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గెలువటంతో వివిధ సంఘాల నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అలాగే వ్యాపార, కుల సంఘాల నాయకులు, నజ్రూల్‌నగర్ బెంగాలీలు తదితరులు ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్‌బాబుకు పూలమాలలు, శాలువాలతో కప్పి ఘనంగా సన్మానించారు.