Kumaram Bheem Asifabad: కూరగాయలు, ఛాయ్ అమ్మిన కాంగ్రెస్ అభ్యర్థి శ్యాం నాయక్
ABN , First Publish Date - 2023-11-04T22:34:41+05:30 IST
రెబ్బెన, నవంబరు 4: ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ నాయకులు రకరకాలుగా పాట్లు పడుతున్నారు. తాజాగా శనివారం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యాం నాయక్ రెబ్బెన మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు పక్కన కొద్ది సేపు కూరగాయాలు అమ్మారు. అనంతరం ఛాయ్ దుకాణంలో ఛాయ్ కాసి అమ్మారు.
రెబ్బెన, నవంబరు 4: ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ నాయకులు రకరకాలుగా పాట్లు పడుతున్నారు. తాజాగా శనివారం ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్యాం నాయక్ రెబ్బెన మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు పక్కన కొద్ది సేపు కూరగాయాలు అమ్మారు. అనంతరం ఛాయ్ దుకాణంలో ఛాయ్ కాసి అమ్మారు. కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు ఛాయ్ దుకాణానికి చేరుకోవ టంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకే ఓటువేసి గెల్పించాల్సిందిగా అభ్యర్థిందారు. ఆయన వెంట డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, పార్టీ మండల అధ్యక్షులు రమేష్, వెంకటేశ్వర్‌గౌడ్, దేవాజీ, నర్సింగరావు, సుదర్శన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.