Kumaram Bheem Asifabad: తల్లిపాలే శ్రేయస్కరం
ABN , First Publish Date - 2023-08-02T22:01:20+05:30 IST
వాంకిడి, ఆగస్టు 2: శిశువు ఎదుగు లకుతల్లిపాలు ఎంత గానో దోహదపడు తాయని సీడీపీవో రిబ్కా అన్నారు. బుధవారం మండ లంలోని బంబార గ్రామంలో బాలింత లకు, గర్భణులకు తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించారు.
వాంకిడి, ఆగస్టు 2: శిశువు ఎదుగు లకుతల్లిపాలు ఎంత గానో దోహదపడు తాయని సీడీపీవో రిబ్కా అన్నారు. బుధవారం మండ లంలోని బంబార గ్రామంలో బాలింత లకు, గర్భణులకు తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ నవజాత శిశువుకు బలం చేకూర్చే ఆహారం తల్లిపాలలో ఉందన్నారు. కార్యక్రమంలో పోషన్ అభియాన్‌కో ఆర్డినేటర్ తోఫిక్, సూపర్‌వైజర్ నసీం, భారతి, కుమారి, టీచర్లు పాల్గొన్నారు.
బెజ్జూరు: తల్లిపాల వారోత్సవాలపై అంగన్‌వాడీలు మండల కేంద్రంలోని ప్రధానవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. తల్లిపాల విశిష్టతను వివరించారు. తల్లి పాలు తాగించడం వల్ల శిశువుకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. కార్యక్ర మంలో సూపర్‌వైర్ కరుణ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
జైనూరు: మండలకేంద్రంలోని బాలాజీనగర్‌లో బుధవారం ప్రపంచ తల్లి పాలవారోత్సవాల్లో భాగంగా గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జైనూరు ఐసీడీఎస్‌ప్రాజెక్ట్ అధికారిణి ఇందిర, సర్పంచ్‌మేస్రం పార్వతీ బాయి, వార్డుసభ్యులు వారోత్సవాల్లో పాల్గొని గర్భిణులకు సూచనలు చేశారు.