Kumaram Bheem Asifabad: జక్కులపల్లిలో కత్తులు, కొడవళ్లతో దాడి
ABN , First Publish Date - 2023-06-26T22:56:28+05:30 IST
రెబ్బెన, జూన్ 26: మండలంలోని జక్కుపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం భూతగాదాల నేపథ్యం లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయప డ్డారని సీఐ అల్లం నరేందర్, ఎస్సై భూమేష్‌తోపాటు గ్రామస్థులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జక్కులపల్లి గ్రామానికి చెందిన మండలాకర్ నాగయ్య, మండలాకర్ బక్కయ్య మధ్య కొంతకాలంగా వారసత్వంగా వస్తున్న 9ఎకరాల భూమికి సంబంధించిన గొడవ కొనసాగుతోంది.
-భూమి పంపకాల్లో తలెత్తిన వివాదం
-ఇద్దరు అక్కడికక్కడే మృతి
-పలువురికి గాయాలు
-సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
రెబ్బెన, జూన్ 26: మండలంలోని జక్కుపల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం భూతగాదాల నేపథ్యం లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయప డ్డారని సీఐ అల్లం నరేందర్, ఎస్సై భూమేష్‌తోపాటు గ్రామస్థులు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జక్కులపల్లి గ్రామానికి చెందిన మండలాకర్ నాగయ్య, మండలాకర్ బక్కయ్య మధ్య కొంతకాలంగా వారసత్వంగా వస్తున్న 9ఎకరాల భూమికి సంబంధించిన గొడవ కొనసాగుతోంది. అయితే ఇటీవల ఇద్దరి కుటుంబాలకు చెందిన వారందరూ కలిసి బీడుగా ఉన్న భూమిని చదును చేసి పంచుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం నాగయ్య వారసులు ఈ భూమిలో ఆదివారం పత్తి గింజలను నాటారు. ఈ విషయం తెలుసుకున్న బక్కయ్య వారసులు పంచుకుందామని చెప్పి భూమిలో విత్తనాలు ఎలా నాటుతారు అని సోమవారం అదే భూమిలో వీరు కూడా విత్తనాలు నాటడానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న నాగయ్య వారసులు సంఘటన స్థలానికి వెళ్లారు. రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తుల మధ్య వాదోపవాదాలు పెరిగి ఘర్షణకు దారితీసింది. అక్కడే ఉన్న వ్యవసాయ పనిముట్లు కొడవళ్లు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో జక్కులపల్లికి చెందిన గిరుకుల బక్కమ్మ(60), నర్సయ్య(30) అక్కడికక్కడే మృతిచెందారు. అలాగే లింగయ్య, దుర్గయ్య, సంతోష్, లక్ష్మణ్, శంకరయ్య, మెంగయ్య తదితరులు గాయపడ్డారు. వీరిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ మేరకు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
మండలాకర్ నాగయ్య ఇంట్లో విషాదం..
భూ వివాదంలో మండలాకర్ నాగయ్య ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది. నాగయ్య సోదరి బక్కమ్మ, కుమారుడు నర్సయ్య ఈతగాదాలో ప్రాణాలు కోల్పో యారు. అనూహ్య ఘటన జరగటం, ఇద్దరు చనిపోవటంతో నాగయ్య కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది.
సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ..
జక్కులపల్లిలో దారుణ హత్యల విషయం తెలుసుకున్న ఎస్పీ సురేష్‌కుమార్ తక్షణమే సంఘటన స్థలానికి చేరుకొని వివాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రెబ్బెన ఎస్సై భూమేష్ ఆధ్వర్యంలో పికెటింగ్ ఏర్పాటు చేశా రు. అలాగే బక్కమ్మ, నర్సయ్య మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అల్లం నరేందర్, ఎస్సై భూమేష్ ఉన్నారు.