స్వరాష్ట్రం ఆవిర్భావంతోనే ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించింది

ABN , First Publish Date - 2023-06-07T01:02:59+05:30 IST

స్వరాష్ట్రం ఏర్పాటుతోనే ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు.

స్వరాష్ట్రం ఆవిర్భావంతోనే ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించింది
కేసీఆర్‌ ఫెక్సీకి క్షీరాభిషేకం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఖానాపూర్‌, జూన్‌ 6 : స్వరాష్ట్రం ఏర్పాటుతోనే ఖానాపూర్‌ మున్సిపాలిటీగా అవతరించిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. మంగళ వారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఖానాపూర్‌ మున్సిపాలిటీలో నిర్వహించిన వేడుకలలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేటీఆర్‌ ప్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ... ఇటీవల నిర్మల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఖానాపూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 25 కోట్లు కేటాయించడం అభినందనీయ మన్నారు. రాబోయే రోజుల్లో ఖానాపూర్‌ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌, ఎంపీపీ అబ్దుల్‌ మోహిద్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుప్పాల శంకర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గొర్రె గంగాధర్‌, మాజీ జడ్పీటీసీ రాథోడ్‌ రాము నాయక్‌, డీఆర్బీఎస్‌ జిల్లా డైరెక్టర్‌ కొక్కుల ప్రదీప్‌, కోఆప్షన్‌ సభ్యులు బండారి కిషోర్‌, నాయకులు రాజ గంగన్న, సుమన్‌, తదితరులు ఉన్నారు.

రైతులు జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

దస్తురాబాద్‌, జూన్‌ 6 : రైతులు జీలుగ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని పీఏసీఎస్‌ సెంటర్‌ వద్ద రైతులకు సబ్సిడీ జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఎరువులు పుష్కలంగా అందుబాటులో ఉంటున్నాయి. కానీ గత పాలకుల పరిపాలనలో రైతులు అష్టకష్టాలు పడు తుండే వారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల ఆదుకుంటుందని పేర్కొంటు న్నారు. రైతులకు జీలుగ విత్తనాలతో పంటపొలాల్లో వేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందవచ్చ న్నారు. భూ సారవంతానికి జీలుగ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సింగరి కిషన్‌, వైస్‌ ఎంపీపీ రాజు నాయక్‌, సహకార సంఘం చైర్మన్‌ రామడుగు శైలజ, గ్రామ సర్పంచ్‌ రాజమణి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు సంతోష్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఐలయ్య యాదవ్‌, రాజ నర్సయ్య, నాయకులు రమేష్‌ రావ్‌, శ్రీనివాస్‌, శివయ్య, లక్ష్మీరాజం, గోపి పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T01:02:59+05:30 IST