కనక లక్కేరావు మృతి తీరని లోటు
ABN , First Publish Date - 2023-08-02T01:59:49+05:30 IST
బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఐటీడీఏ అనుబంధంగా ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు మృతి పార్టీకి తీరని లోటని బీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌కు నివాళ్లర్పించిన పీవో, కలెక్టర్, తదితరులు
ఇంద్రవెల్లి, ఆగస్టు 1: బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఐటీడీఏ అనుబంధంగా ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు మృతి పార్టీకి తీరని లోటని బీఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని తుమ్మగూడ గ్రామానికి చెందిన కనక లక్కేరావు(57) గుండెపోటుతో మంగళ వారం మృతి చెందాడు. ఆయన మృతదేహాన్ని కలెక్టర్ రాహుల్‌రాజ్, పద్మశ్రీ అవా ర్డు గ్రహీత కనకరాజు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, మాజీ ఎంపీ గోడం నగేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలు పెందూర్ నీలాబాయి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల్లో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బోజ్జు పటే ల్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి బా పురావు, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందోర్ పుష్పరాణి, తదితరు లు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
ఫ చైర్మన్ మృతి పట్ల కలెక్టర్ సంతాపం
కనక లక్కేరావు మృతి పట్ల కలెక్టర్ రాహుల్‌రాజ్ సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని తుమ్మగూడ గ్రామానికి చెందిన లక్కేరావు గుండె పోటుతో మృతి చెందగా.. విషయం తెలుసుకున్న కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఇందులో నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఉట్నూర్ ఐటీడీఏ పీవో చాహత్‌బాజ్‌పాయి, తదితరులు ఉన్నారు.
లక్కేరావు మృతితో ఉట్నూర్‌లో విషాదం
ఉట్నూర్: ఐటీడీఏ ఆదిమ గిరిజనుల అభివృద్ధి సలహా కమిటీ చైర్మన్ కనక లక్కేరావు మంగళవారం గుండెపోటుతో మృతి చెందడంతో ఉట్నూర్‌లో విషాదం నెలకొంది. 2009 నుంచి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తన టీచర్ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కనక లక్కేరావు ఉమ్మడి జిల్లాలోని రాజకీయ నాయకులందరికి, అధికారులందరికీ స్థిరపరిచీయుడు. దశాబ్ద కాలంగా ఉట్నూర్‌లోనే నివాసం ఉంటున్నారు. బీఆర్‌ఎస్ అధి కారం చేపట్టిన అనంతరం ఆయనను ఐటీడీఏ అనుబంధంగా ఉన్న ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్‌గా నియమించింది. తిరిగి 2021లో మరోసారి చైర్మన్‌గా నియమించడం తో ఉమ్మడిజిల్లాలోని ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి సలహాలు సూచనలు అం దిస్తూ ఐటీడీఏ ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు చేదోడువాదోడుగా ఉంటున్నారు. గత రెండు నెలల క్రితం మొదటిసారి గుండెపోటుకు గురి కావడంతో బైపాస్ సర్జరీ చేయించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో మంగళవారం మళ్లీ గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు రిమ్స్‌కు తరలించారు. వైద్యం అందిస్తుండగా ఆయన తుది శ్వాసవిడిచారు. లక్కేరావు మృతి వార్త తెలియడం తో ఉట్నూర్ ప్రజలతో పాటు ఐటీడీఏ ఉద్యోగులు ఆవేదనకు లోనయ్యారు.