కమనీయం.. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2023-03-05T01:15:09+05:30 IST

పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆల యంలో శనివారం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీపద్మావతీ శ్రీనివాసుల కల్యాణ మహోత్సవ వేడుకలు కమనీయంగా కొనసాగాయి.

కమనీయం.. శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
కల్యాణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న పండితులు

భైంసా, మార్చి 4: పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆల యంలో శనివారం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీపద్మావతీ శ్రీనివాసుల కల్యాణ మహోత్సవ వేడుకలు కమనీయంగా కొనసాగాయి. ఉదయం 11 గంటలకు శ్రీ భూ, పద్మావతి సమేత శ్రీనివాసస్వామి ఉత్సవ మూర్తుల కల్యాణోత్సవ శోభయాత్రతో ప్రారంభమైన వేడుకలు సాయంత్రం వరకు భక్తుల కోలహలం మద్య వైభవంగా కొనసాగాయి. ఉత్సవమూర్తులను కల్యాణవేదిక వద్దకు ముస్తాబు చేసి శోభాయాత్రగా తీసుకవచ్చారు. అనంతరం సంగారెడ్డికి చెందిన శ్రీ చక్రవర్తుల సుదాన్వా చారి, చక్రవర్తుల సంతోష్‌ చేతుల మీదుగా కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మద్య శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహణ కమిటీ భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది. రాత్రి పద్మావతీనగర్‌ పురవీధుల్లో శ్రీస్వామి వారి పల్లకిని ఉరేగించారు. ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌కృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షు రాలు పీ. రమాదేవి, బీజేపీ భైంసా పట్టణ అధ్యక్షులు యనుపోతుల మల్లేశ్వర్‌లతో పాటు పలువురు ప్రముఖులు, భైంసా పట్టణ భక్తులే కాకుండా సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అధికసంఖ్యలో కల్యాణో త్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

Updated Date - 2023-03-05T01:15:09+05:30 IST