కాళేశ్వరం నీటితో రైతులకు కష్టాలు
ABN , First Publish Date - 2023-08-02T22:36:14+05:30 IST
బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో పంటలు మునిగి రైతులు కష్టాలు పడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి అన్నారు.
చెన్నూరు, ఆగస్టు 2: బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో పంటలు మునిగి రైతులు కష్టాలు పడుతున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్‌వెంకటస్వామి అన్నారు. మండలంలోని సుందరశాల గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు. పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నాలుగేళ్లుగా పంటలు మునిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ రైతులను పట్టించుకోవడం లేదని, నష్టపరిహారం ఇప్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాకా వెంకటస్వామి ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కమీషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిం చారని చెప్పారు. ముంపు బాధితులకు నష్టపరిహారం అందించాలని బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాళేశ్వరం పనికి రాని ప్రాజెక్టు అని విమర్శిం చారు. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు రైతులకు నష్టపరిహారం అందించాలని. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కల్పించాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాఽథ్, ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏసీసీ: కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కేసీఆర్ ప్రజలను నిండా ముంచారని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు.జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్, రాంనగర్, ఎల్‌ఐసీ కాలనీల్లో ఇటీవల వ చ్చిన వరదల వల్ల ఇళ్లు నీట మునిగిన బాధితుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మూడేళ్లుగా మంచిర్యాల, చెన్నూరు నియోజకవర్గాల్లో రైతుల పంట పొలాలు, ఇళ్లు నీట మునిగి నష్టపోతున్నారన్నారు. వరదలు రాకుండా శాశ్వత పరిష్కారంగా గోదావరి, రాళ్లవాగుకు కరకట్టలు కట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ నాయకుడు హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.