నేర పరిశోధనలో జాగిలాల పాత్ర కీలకం : ఎస్పీ
ABN , First Publish Date - 2023-02-18T01:12:25+05:30 IST
నేర పరిశోధనలో పోలీసుశాఖకు చెందిన జాగిలాలు కీలక పాత్ర వహిస్తున్నా యని ఎస్పీ సీహెచ్. ప్రవీణ్‌కుమార్ అన్నారు.
నిర్మల్ కల్చరల్, ఫిబ్రవరి 17 : నేర పరిశోధనలో పోలీసుశాఖకు చెందిన జాగిలాలు కీలక పాత్ర వహిస్తున్నా యని ఎస్పీ సీహెచ్. ప్రవీణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్ జిల్లాకు చెందిన లాబ్‌జాతికి చెందిన జాగిలం హంటర్ డాగ్ బ్రాన్స్ మూడో పథకం సాధించినందున ఎస్పీ క్యాంపు కార్యాలయంలో అభినందించారు. హైద రాబాద్‌లోని మొయినాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఎనిమిది నెలలు ఇచ్చిన శిక్షణలో 28 జాగిలాలతో పోటీ పడింది. శిక్షణ ఇచ్చిన సంరక్షకుడిని ఎస్పీ అభినందించారు. హత్య, దోపిడీలు, దొంగతనాలతో నిందితులను పట్టించడం, సంఘ విద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలు గుర్తించి ప్రాణ, ఆస్తి నష్టం నివారిం చడంలో కీలకంగా మారాయన్నారు. ఆర్‌ఐ రమేష్, జాగిలం సంరక్షకు డు మధుకర్, తదితరులు పాల్గొన్నారు.