ఉచితం సరే... పల్లెలకు బస్సులేవి..
ABN , First Publish Date - 2023-12-10T22:08:47+05:30 IST
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం ప్రారంభ మైంది. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం జీరో చార్జీ టికెట్టును ఆవిష్కరించారు. మహిళలు రాష్ట్రంలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలుతో మహిళల్లో ఆనందం వ్యక్తమ వుతోంది. కాని జిల్లాలోని చాలా గ్రామాల మహిళలకు ఉచిత ప్రయాణ యోగం కలగడం లేదు. జిల్లాలో వందకు పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు.
నెన్నెల, డిసెంబరు 10: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో ఒకటైన మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం ప్రారంభ మైంది. సీఎం రేవంత్‌రెడ్డి శనివారం జీరో చార్జీ టికెట్టును ఆవిష్కరించారు. మహిళలు రాష్ట్రంలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. ఈ పథకం అమలుతో మహిళల్లో ఆనందం వ్యక్తమ వుతోంది. కాని జిల్లాలోని చాలా గ్రామాల మహిళలకు ఉచిత ప్రయాణ యోగం కలగడం లేదు. జిల్లాలో వందకు పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఆయా గ్రామాల ప్రజలందరూ ప్రైవేటు వాహనాల పైనే ఆధార పడుతున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చినప్పటికి గ్రామీణ మహి ళలు మూడింతల చార్జీలు భరించి ప్రయాణించాల్సిన పరిస్థితే ఉంది. గ్రామీణ మహిళలు మండల కేంద్రాలు, పటణాలకు వస్తేనే బస్సుల్లో ఫ్రీగా ప్రయాణిం చే అవకాశం ఉంది. రోడ్డు ఉన్న గ్రామాలన్నింటికి బస్సులు నడిపిస్తేనే పల్లె మహిళలు లబ్ధి పొందుతారు.
బస్సు రాని గ్రామాలు వందకు పైనే...
జిల్లాలో చాలా వరకు మారుమూల పల్లెలే ఉన్నాయి. అక్కడి ప్రజలు ఏ అవసరం వచ్చినా మండల కేంద్రాలు, సమీప పట్టణాలకు వెళ్లాల్సిందే. మం చిర్యాల జిల్లాలో వందకు పైగా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రోడ్లు ఉండి కూడా ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. కొవిడ్ సమయంలో రద్దు చేసిన బస్సులను పునరుద్ధరించలేదు. మరికొన్ని చోట్ల ఆదాయం రావడం లేదనే నెపం తో రద్దు చేసేశారు. రోడ్డు బాగున్న గ్రామాలకు కూడా పల్లెవెలుగు బస్సులు వెళ్లడం లేదు. గ్రామస్థులు బస్సు వేయాలని విన్నవించుకున్నా స్పందన అం తంత మాత్రమే ఉంటోంది. ఆర్టీసీ అధి కారులు అధిక ఆదాయం వచ్చే రూట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెవెన్యూ రావ డం లేదనే నెపంతో గ్రామీణ ప్రాంతాల సెటిల్ బస్సు ట్రిప్పులను రద్దు చేశారు. బస్సు సౌకర్యం లేక ఆటోలు, ప్రైవేటు వాహనాలపై ఆధార పడుతున్నారు. ఆర్టీసీ కంటే మూడింతలు ఎక్కువగా ఉండే ప్రైవేటు చార్జీలు భరించలేక విలవిల్లాడుతున్నారు.
ఇబ్బంది పడేది మహిళలే..
పొదుపు సంఘాల మహిళలు, విద్యార్థినులు, చిరు ఉద్యోగులు, ప్రైవేటు సం స్థల్లో పనిచేసేవారు, అడ్డా కూలీలు, ఆసుపత్రులకు, ఇతర పనులకు వెళ్లే వారు ఇలా పెద్ద సంఖ్యలో మహిళలు రోజు ప్రయాణం చేస్తుంటారు. వీరందరికి ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి. ఆటోలు, జీపుల్లో పరిమితికి మించి ఎక్కించుకుంటుండటంతో మహిళలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు సైతం గత్యంతరం లేక ఆటోల్లో డ్రైవర్ పక్కన కూర్చొని ప్రయాణిం చాల్సి వస్తోంది. ఒక్కో ఆటోలో 10 నుంచి 12 మంది, జీపుల్లో 20 మందికి పైగా తీసుకెల్తుండటంతో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది.
ఎమ్మెల్యేలు దృష్టి సారించాలి
మహాలక్ష్మి పథకం లక్ష్యం నెరవేరాలంటే ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ వెంకటస్వామి, ప్రేంసాగర్‌రావులు వారివారి నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్టీసీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఏఏ గ్రామాలకు రోడ్లు ఉన్నాయి, ఎక్కడి వరకు బస్సులు నడుస్తున్నాయి, ఇప్పుడు ఎన్ని గ్రామాలకు బస్సులు తిప్పొచ్చు అంశాలపై చర్చించాలి. గ్రామీణ మహిళ లు సైతం లబ్ధిపొందేలా చూడాల్సిన బాధ్యత శాసన సభ్యు లపై ఎంతైన ఉంది.