పంట రుణమాఫీ చేయకపోవడం దారుణం: పాల్వాయి హరీష్‌బాబు

ABN , First Publish Date - 2023-05-15T22:09:30+05:30 IST

పెంచికలపేట, మే 15: ప్రభుత్వం రైతు లకు రుణమాఫీ చేయక పోవడం దారుణమని బీజేపీ నియోజకవర్గ నాయకుడు పాల్వాయి హరీష్‌బాబు విమర్శిం చారు.

పంట రుణమాఫీ చేయకపోవడం దారుణం: పాల్వాయి హరీష్‌బాబు

పెంచికలపేట, మే 15: ప్రభుత్వం రైతు లకు రుణమాఫీ చేయక పోవడం దారుణమని బీజేపీ నియోజకవర్గ నాయకుడు పాల్వాయి హరీష్‌బాబు విమర్శిం చారు. పల్లెపల్లెకూ పాల్వాయి.. గడపగడ పకూ బీజేపీ యాత్రను సోమవారం 9వరోజు మండలంలోని బొంబా యిగూడ, ఎర్రగుంట, పోతెపల్లి, మొట్లగూడ, గొంట్లపేట, చెడ్వాయి, దరోగపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష రూపా యల రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్‌ రుణమాఫీ చేయకపోగా అదనంగా లక్ష రూపాయల వడ్డీబ్యాంకర్లకు చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందన్నారు. వెంటనే పంటరుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మధుకర్‌, శంకర్‌గౌడ్‌, భీమయ్య, శ్రీనివాస్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-15T22:09:30+05:30 IST