ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టింపు లేదు
ABN , First Publish Date - 2023-03-19T22:31:59+05:30 IST
పట్టణంలోని రైల్వేఅండర్ బ్రిడ్జిలో నీరు చేరి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే దివాకర్‌రావుకు పట్టింపు కరువైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాఽథ్ అన్నారు.

ఏసీసీ, మార్చి 19 : పట్టణంలోని రైల్వేఅండర్ బ్రిడ్జిలో నీరు చేరి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే దివాకర్‌రావుకు పట్టింపు కరువైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాఽథ్ అన్నారు. శనివారం కురిసిన వర్షంతో పట్టణంలోని రైల్వేఅండర్ బ్రిడ్జిలో నీరు చేరి రాకపోకలకు అంతరాయం కలుగడంతో ఆదివారం బీజేపీ నాయకులు అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రఘునాఽథ్ మాట్లాడారు. వర్షం నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయనందున అండర్ బ్రిడ్జి కొద్దిపాటి వర్షానికే నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పారు. పాదచారులకు రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, రమేష్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.