సాగునీరు అందేనా ?

ABN , First Publish Date - 2023-08-13T01:31:42+05:30 IST

ఏళ్లు గడుసున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తికావడం లేదు.

సాగునీరు అందేనా ?
కాలువ పనులు పూర్తి అయితే వినియోగంలోకి రానున్న భూములు

28 ప్యాకేజీలో 50 శాతం వరకు పూర్తికాని పనులు

అసంపూర్తిగా కాళేశ్వరం కాలువ పనులు

నిలిచిన కాలువ పనులు జరుగుడెప్పుడో..?

పదకొండు సంవత్సరాలలో జరిగింది గోరంత..జరగాల్సింది కొండంత

నేటికి పూర్తి అయిన పనులు 48.23 శాతమే

ముథోల్‌, ఆగస్టు 12 : ఏళ్లు గడుసున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తికావడం లేదు. కాళేశ్వరం పనులు సకాలంలో పూర్తి చేయక పోవడంతో రైతులకు సాగునీరు అందని ద్రాక్షగా మారింది. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. ఆక్కడి నుంచి తెలంగాణలోని ఆయా జిల్లాల్లో బీడు భూములను సస్య శ్యామలం చేసేందుకు ఎత్తిపోతల ద్వారా కాలువలకు నీరు అందించే దిశ గా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ముథోల్‌ నియోజకవర్గంకు 50వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 2013 సంవత్సరంలో ఎత్తి పోతల పనులను (28 ప్యాకేజీ పనులు) చేపట్టి 11 సంవత్సరాలు కావ స్తున్నా పూర్తికాలేదు. సంబంధిత కాలువ పనులు సైతం జరుగక నిలచి పోయాయి. కాలువ పనులు త్వరిత గతిన పూర్తి అయితే మా బీడు భూ ములు పంటలతో కళకళలాడి మా కష్టాలు గట్టెక్కుతాయన్న గంపెడు ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు 11 సంవత్సరాల నుంచి పనులు పూర్తి కాక పోవడంతో నిరాశ మిగిలింది. వివరాలోకి వెళ్తే ముథోల్‌ నియోజక వర్గానికి 28 ప్యాకేజీ కింద రాష్ట్రప్రభుత్వం రూ.486 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు సుమారు 235 కోట్ల పనులు జరుగగా సుమారు రూ.260 కోట్ల రూపాయల పనులు జరుగాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే ని యోజకవర్గంలోని ఉమ్మడి ముథోల్‌ మండలంతో పాటు తానూర్‌, కుభీర్‌, భైంసా మండలంలోని ఆయా గ్రామాల్లోని 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనుంది. ఈ ఎత్తిపోతల పనులకు చిన్న కాలువలు, పెద్ద కాలు వలు, తూంలు తదితర వాటికి సుమారు 3026 ఎకరాల భూమి అవ సరం అయితే ఇప్పటి వరకు 650 మంది రైతుల నుంచి సుమారు 555 ఎకరాల భూమి సర్వే చేశారు. ఇందులో ఈ పనులకు 457 ఎకరాల 37 గుంటల భూమికి సంబంధించిన 547 మంది భూమి కోల్పోయిన రైతులకు భూ నష్ట పరిహారం డబ్బులను గతంలో అఽధికారులు అందజే శారు. అలాగే మరో 111 ఎకరాల భూమి కోల్పో యిన 93 మంది రైతు లకు నష్టపరిహా రం ఇటీ వల కాలంలోనే అందిం చారు. సుమారు మరో 400 ఎకరాలు సర్వేపూర్తి అయినప్పటికీ రెవెన్యూ అధికారుల క్లియరెన్స్‌కు పంపినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మరో 2000 ఎక రాలకు పైగా భూసర్వే చేసి అందులో భూమి కోల్పోయిన రైతుల వివ రాలు సేకరించి నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉంది.

నత్తకే నడక

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2013లో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా 28 ప్యాకేజీ ముథోల్‌ నియోజకవర్గంలో ప్రారం భించారు. దీంతో ఇక్కడి రైతులు తమ భూములకు సాగునీరు అందు తుందని, తాము పంటలు సాగుచేసుకోవచ్చని ఎన్నో కలలుకన్నారు. కానీ సుమారు 11 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సంబంధిత చిన్న, పెద్ద కాలువల నిర్మాణానికే భూముల సేకరణ పూర్తి కాలేదు. పనులు సైతం నత్తకు నడగ నేర్పే విధంగా ఉందని ఇక్కడి ప్రాంత రైతులు అంటు న్నారు. 11 సంవత్సరాలకు కేవలం 48.23శాతం పనులైతే మిగతా పను లకు ఎన్ని సంవత్సరాలు పడుతదని ప్రశ్నిస్తున్నారు. మేన్‌ కెనాల్‌ పను లు, తదితర పనులు జరుగాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆపనులేం జరగడం లేదు. 2013-2019 సంవత్సరం వరకు పూర్తి చేయాల్సి ఉండగా పనులు పూర్తికాకపోవడంతో గడువు పొడగింపుకై ప్రభుత్వానికి దరఖాస్తు చేసు కున్నారు. 2020-2021 వరకు గడువుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసు కున్నాట్లు తెలిసింది. మరలా సంబంధిత కాంట్రాక్టర్లు పని చేయడానికి ముందుకు రాలేక పోవడంతో ప్రభుత్వం కొత్తఏజెన్సీ పిలిచి టెండరు వేయనున్నట్లు సంబంధిత అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా సం బంధిత 28 ప్యాకేజీ పనులు పూర్తి అయితే ఇక్కడి రైతులకు మేలు జరుగనుంది. పనులు వేగమంతం చేసి సాగునీరు అందిచాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

రైతులకు సాగు నీరు త్వరితగతిన అందించాలి

ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 28 ప్యాకేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగు నీరందివ్వాలి. ఏళ్లు గడిచిన ప్రభుత్వం 28 ప్యాకేజీ పనులను నత్త నడకన చేపట్టడంతో రైతులకు అన్యాయం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం టెండర్లను పిలిచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా చేపట్టిన ఈ పనులు పూర్తి చేసి రైతన్నలకు ఇబ్బంది లేకుండా వెంటనే సాగునీరు అందివ్వాలి. కాలయాపన చేయ డంతో రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి 28 ప్యాకేజీ పనులు పూర్తి చేసి రైతులకు సాగు నీరందివ్వాలి

- సర్దార్‌ వినోద్‌ కుమార్‌, టీజేఏసీ ముథోల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి

తొందర పనులు పూర్తిచేసి నీరు అందివ్వాలి

ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కాలువ పనులు పూర్తి చేస్తే మా 5ఎకరాల భూమికి సాగునీరు అందుతుంది. ఈ పనులు పూర్తి అయితే మాలాంటి పేద రైతులకు మేలు జరుగుతుంది. 11 సంవత్సరాల నుంచి ఎప్పుడు నీళ్లు వస్తాయని ఎదురుచూస్తున్నాం. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు చర్యలు చేపట్టి ఈ పనులు పూర్తిచేసి నీరు అందివ్వాలని కోరుతున్నాం.

- శివురాం, రైతు

పనులు చేపడతాం

28 ప్యాకేజీ పనులు మధ్యలో ఆగిపోయాయి. త్వరలో ప్రారంభిస్తాం. కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. ఇప్పటి వరకు 457 ఎకరాల 37 గుంటలకు సంబంధించిన రైతులకు నష్ట పరిహారం అందించడం జరుగగా మరో 111 ఎకరాలకు సంబంధించి 93 రైతులకు ఇటీవల డబ్బులు ఇచ్చాము. మరో 400 ఎకరాల భూమి సర్వే చేయించాము. రెవెన్యూ అధికారుల క్లియరెన్స్‌కు పంపించాం. సుమారు 2వేల ఎకరాల భూసర్వేచేసి భూహక్కు దా రులను గుర్తించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే త్వరలో టెండర్‌ పూర్తిచేసి పనులు చేపడుతామని జేఈ తెలిపారు.

Updated Date - 2023-08-13T01:31:42+05:30 IST