Share News

పెరిగిన నేరాలు

ABN , Publish Date - Dec 30 , 2023 | 10:18 PM

జిల్లాలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. గంజాయి, మత్తు పదార్ధాల రవాణా, విద్యార్థులు, యువత లక్ష్యంగా విక్రయం జోరుగా సాగుతోంది. పేకాట, బెట్టింగ్‌, గొలుసుకట్టు నేరాలు ఊపందు కున్నాయి. చదువుకున్న వారు సైతం వైట్‌కాలర్‌ మోసగాళ్ళ వలలో పడు తున్నారు.

పెరిగిన నేరాలు

ఏసీసీ, డిసెంబరు 30: జిల్లాలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. గంజాయి, మత్తు పదార్ధాల రవాణా, విద్యార్థులు, యువత లక్ష్యంగా విక్రయం జోరుగా సాగుతోంది. పేకాట, బెట్టింగ్‌, గొలుసుకట్టు నేరాలు ఊపందు కున్నాయి. చదువుకున్న వారు సైతం వైట్‌కాలర్‌ మోసగాళ్ళ వలలో పడు తున్నారు. మోసాలకు పాల్పడిన సంస్థలు, వ్యక్తులు ఎక్కడో ఉండడం, బాధితులతో వారికి నేరుగా సంబంధం లేకపోవడంతో అనేక సంఘ టనల్లో నేరస్తులు సులువుగా తప్పించుకుంటున్నారు. సైబర్‌ మోసాలకు గురైన వారిలో గ్రామీణ, పట్టణ, పేద, ధనిక, ఉన్నత విద్యావంతులు అనే తేడా లేకుండా అందరూ బాధితులుగా ఉన్నారు. జిల్లాలో 2022లో వివిధ నేరాలకు సంబంధించి 3745 ఫిర్యాదులు అందగా 2023లో 4793 ఫిర్యా దులు వచ్చాయి. పీటీ కేసులతో కలిపి మొత్తం గతేడాది 8766 కేసులు ఉండగా ఈయేడు 9446 కేసులు నమోదయ్యాయి. ఈయేడు తీవ్ర నేరాలకు సంబంధించి 95 ఉన్నాయి. వీటిలో దోపిడీ 3, మర్డర్‌ 22, కిడ్నా ప్‌ 41, రేప్‌లు 25, తీవ్రంగా గాయపర్చిన కేసులు 57, హత్యాయత్నం కేసులు 41 తదితర కేసులు ఉన్నాయి. వివిధ నేరాల వల్ల జిల్లాలో జరిగిన ఆస్తినష్టం రూ.2,16,02,057 కాగా, రూ. 53,89,810లు రికవరీ చేశారు.

- రియల్‌ ఎస్టేట్‌ మోసాలు, హత్యలు

జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ మోసాలు పెరిగాయి. జిల్లా కేంద్రానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నడిపెల్లి లక్ష్మీకాంతరావు భూ విక్రయ ఒప్పం దంలో వచ్చిన తేడాల వల్ల హత్యకు గురయ్యారు. అక్రమ వెంచర్లు వెలిశాయి. ప్రభుత్వ స్థలాల ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో కొన్నిచోట్ల అధికారులు కట్టడాలను కూల్చివేశారు.

- భారీగా గంజాయి రవాణా, అక్రమ అమ్మకాలు

జిల్లా కేంద్రంతోపాటు జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి భారీగా గం జాయి అక్రమ రవాణా జరుగుతోంది. విద్యార్థులు యువతే లక్ష్యంగా కాలే జీలు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల్లో స్మగ్లర్లు గంజాయిని విక్రయి స్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి కేజీల కొద్ది గంజాయిని కొనుగోలు చేసి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌కు సంబంధించి 49 నేరాలలో 73 మందిపై కేసులు నమోదు చేసి 483 కిలోల డ్రై గంజాయిని స్వాధీన పర్చుకొన్నారు.

- పెరిగిన రోడ్డు ప్రమాదాలు

అజాగ్రత్త, అతి వేగంగా వాహనాలు నడపడం, సీటు బెల్టు ధరించక పోవడం, సిగ్నల్‌ జంపింగ్‌, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. 326 రోడ్డు ప్రమాదాల్లో 111 మంది మృతి చెందగా 320 మంది గాయాల పాలయ్యారు. జిల్లాలో తరుచుగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే 31 మందిపై హిస్టరీ షీట్స్‌ను ఓపెన్‌ చేశారు. 10 మందిపై రౌడీషీట్స్‌, 16 మందిపై సస్పెక్ట్‌ షీట్‌లు ఓపెన్‌ చేశారు.

-ఇటుక బట్టీల్లో బాల్యం

ఇటుక బట్టీల్లో బాలల భవిష్యత్తు మట్టి పాలవుతోంది. ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు కూలీలు కుటుంబ సమేతంగా వచ్చి పని చేస్తున్నారు. పెద్దలు, పిల్లలు ఇటుక బట్టీల్లో పని చేస్తూ చదువుకు దూరమవుతున్నారు. లేబర్‌ అధికారులు అప్పుడప్పుడు తనిఖీ చేసి బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దని హెచ్చరిస్తున్నా కొద్ది రోజులకు మళ్లీ బాలలు పనిచేస్తున్నారు. ఆపరేషన్‌ స్మైల్‌ ప్రోగ్రాం ద్వారా 57 మంది పిల్లలను రక్షించి పాఠశాలల్లో చేర్పించి వసతి కల్పించారు.

- సీసీ కెమెరాల ఏర్పాటు

జిల్లాలో సీసీ కెమెరాలు ఉన్నా అనేక చోట్ల పనిచేయడం లేదు. నేరాలు, ప్రమాదాలు జరిగినప్పుడు నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వాటి నిర్వహణ సరిగ్గా లేక నిరు పయోగంగా మారాయి. కమ్యూనిటీ సీసీ కెమెరాల కార్యక్రమంలో భాగం గా 768, నేను సైతం ద్వారా 258 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

అవగాహన కార్యక్రమాలు

షీటీంల ద్వారా మహిళల వేధింపులను అరికట్టడానికి అవగాహన సదస్సులు , సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. న్యాయ సేవా సాధికార సంస్థల ద్వారా న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చట్టాలపై అవగాహన కల్పిస్తూ నేరాల నియంత్రణకు పోలీసులు వివిధ శాఖల అధికారులతో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారు.

Updated Date - Dec 30 , 2023 | 10:18 PM