ఖర్చులకు అనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవాలి
ABN , First Publish Date - 2023-03-19T00:29:50+05:30 IST
నిర్మల్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో రోజు రోజుకు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి సూచించారు.

నిర్మల్ కల్చరల్, మార్చి 18 : నిర్మల్ మున్సిపల్ కార్పొరేషన్‌లలో రోజు రోజుకు పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని కలెక్టర్ కే.వరుణ్‌రెడ్డి సూచించారు. శనివారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. రూ.80 కోట్ల 24 లక్షల అంచనాతో వార్షిక బడ్జెట్ కౌన్సిల్ ఆమోదిం చింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నిర్మల్ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనతో పాటు వారి సంక్షే మానికి పాటుపడాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడా లని, రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉండాలని స్పష్టం చేశారు. కమిషనర్ సీవీఎన్ రాజు, ఇంజనీర్ నాగేశ్వర్‌రావు, కౌన్సిలర్లు, సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు.