ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-03-31T01:43:28+05:30 IST

ప్యారమూర్‌లో ఛత్రపతి శి వాజీ సేవా సమితి ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఛ త్రపతి శివాజీ విగ్ర హాన్ని ఆవిష్కరించారు.

ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ
శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

సారంగాపూర్‌ రూరల్‌, మార్చి 30 : మండలంలోని ప్యారమూర్‌లో ఛత్రపతి శి వాజీ సేవా సమితి ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ఛ త్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి విగ్ర హాన్ని మంత్రి అల్లోల సోదరుడు అల్లోల మురళీ ధర్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సేవా సమితి కమిటీ సభ్యులను అభినందించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌ రెడ్డి, సర్పంచ్‌ ఉప్పుల దివ్య, డీసీసీబీ డైరెక్టర్‌ నారాయణ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు చందు, నాయకులు శ్రీనివాస్‌ రెడ్డి, మాధవ్‌ రావులతో పాటు ఆయా గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, గ్రామస్థులు ఉన్నారు.

Updated Date - 2023-03-31T01:43:28+05:30 IST