Share News

క్రిస్మస్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

ABN , Publish Date - Dec 23 , 2023 | 09:57 PM

క్రిస్మస్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. శనివారం మైనా ర్టీ ఫంక్షన్‌హాలులో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి హాజరయ్యారు.

క్రిస్మస్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 23 : క్రిస్మస్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పేర్కొన్నారు. శనివారం మైనా ర్టీ ఫంక్షన్‌హాలులో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నీరటి రాజేశ్వరితో కలిసి హాజరయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 25న క్రిస్మస్‌ పం డగను ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రైస్తవులకు కానుకలు అందిస్తామన్నారు. నియోజకవర్గానికి వెయ్యి క్రిస్మస్‌ కానుకల చొప్పున మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియో జకవర్గాలకు 3 వేల కానుకలు పంపిణీ చేశామని, విందు కోసం నియో జకవర్గానికి రూ.2 లక్షలు చొప్పున మూడు నియోజకవర్గాలకు అందించా మన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. అధికారులు, పాస్టర్లు పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలోని ఆర్‌బీహెచ్‌వీ పాఠశాలలో క్రిస్మస్‌ వేడుకలను నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ స్వరూప కేక్‌ కట్‌ చేశారు. విద్యార్థులు నృత్యాలు చేసి అలరించారు. శాంతాక్లాజ్‌ వేషధారణతో విద్యార్థులు పలు వుర్ని ఆకట్టుకున్నారు. విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. రీనారాణిదాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 09:57 PM