Share News

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

ABN , Publish Date - Dec 22 , 2023 | 10:34 PM

మంచిర్యాల పట్టణంలోని జిల్లా సైన్స్‌ కేంద్రంలో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య రామానుజన్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

ఏసీసీ, డిసెంబరు 22: మంచిర్యాల పట్టణంలోని జిల్లా సైన్స్‌ కేంద్రంలో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య రామానుజన్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. డీఈవో మాట్లాడుతూ గణితంపై మక్కువ పెం చుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకుని ఉన్నత శిఖరాలకు చేరు కోవచ్చన్నారు. సెక్టోరియల్‌ అధికారులు చౌదరి, శ్రీనివాస్‌, సత్యనారాయణ, సైన్స్‌ అధికారి మధుబాబు, ఎంఈవో పోచయ్య పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్‌ ఇంటర్నేషనల్‌ పాఠశాలలో గణిత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు గణిత ప్రదర్శనలు చేసి ఆకట్టుకు న్నారు. ప్రిన్సిపాల్‌ వెంకటేష్‌ మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్‌ గణి తంలో ప్రవేశపెట్టిన సూత్రాలు దేశ విదేశాల్లో ఆచరణలో ఉన్నాయన్నారు. రామానుజన్‌ను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

జిల్లా కేంద్రంలోని శ్రీచైతన్య పాఠశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహిం చారు. రామానుజన్‌, భట్టాచార్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివా ళులర్పించారు. ప్రధానోపాధ్యాయుడు జోబిన్‌, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.

హాజీపూర్‌: దొనబండ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో విద్యార్థులు గణి తానికి సంబంధించిన ఆకారాలను, రామానుజన్‌ సంఖ్య 1729ను మానవ హారంగా ప్రదర్శించారు. అనంతరం ఉపాధ్యాయులు గణితంపై విద్యార్థు లకు క్విజ్‌ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. హెచ్‌ఎం హన్మాండ్లు, ఉపాధ్యాయులు నాగరాజు, మనోజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 10:34 PM