Share News

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

ABN , Publish Date - Dec 23 , 2023 | 09:58 PM

మండలంలోని నార్వాయిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకు న్నారు. రైతన్నకు జై కొడుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

నెన్నెల, డిసెంబరు 23: మండలంలోని నార్వాయిపేట ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకు న్నారు. రైతన్నకు జై కొడుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పిల్లలం దరు పొలాలకు వెళ్లి కూలీలతో కలిసి నాట్లు వేసి, పత్తి సేకరించారు. వ్యవ సాయ పనిముట్లు, ఆహారధాన్యాలు, మోటారు పనితీరును వివరించారు. రైతు శ్రమను వృథా చేయబోమని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. పంట పొలాల్లోనే రైతులను సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు కోడూరి శ్రీనివాస్‌, టీచర్లు భీమ్‌పుత్ర, జలంపల్లి శ్రీనివాస్‌, స్నేహలత పాల్గొన్నారు.

లక్షెట్టిపేటరూరల్‌: లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మాజ్యోతిరావుపూలే బాలికల పాఠశాల ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయునీలు విద్యార్థినులు పలు వ్యవసాయ పంటలలో క్షేత్ర ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నాగచంద్రిక, వార్డెన్‌ అపర్ణ, ఏటీపీ రజనీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 09:58 PM