యాదవ కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2023-05-28T22:30:41+05:30 IST
మంచిర్యాల కలెక్టరేట్, మే 28: యాదవ కుల స్తులు ఆర్థిక, సామాజికంగా అన్ని రంగాల్లో అభి వృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్ హాల్‌లో యాదవ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, మే 28: యాదవ కుల స్తులు ఆర్థిక, సామాజికంగా అన్ని రంగాల్లో అభి వృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్ హాల్‌లో యాదవ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలరాజుయా దవ్, టూరిజం చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, యాదవ హక్కుల సంఘం పోరాట సమితి జాతీ యాధ్యక్షుడు రాములు యాదవ్‌తో కలిసి పాల్గొ న్నారు. వారు మాట్లాడుతూ యాదవుల ఆర్థికాభివృ ద్ధికి అన్ని రకాలుగా ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుం దన్నారు. గొర్రెల పంపిణీ ద్వారా యాదవులు ఆర్ధికాభివృద్ధి సాధిస్తున్నారన్నారు. కుల వృత్తులకు సీఎం కేసీఆర్ బాసటగా నిలుస్తున్నారన్నారు. యాద వుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టు కున్నాయి. సంఘం రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్, సంపత్‌యాదవ్, రాజేష్, కొమ్ము అశోక్, అరిగెల పద్మ, పల్లె తిరుమల, అల్లం నాగన్న, గోపు లింగన్న, కుమార్, లావణ్య, ఆవుల సురేష్, నాగభూషణం, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏసీసీ: రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్‌యాదవ్ జిల్లా కేంద్రానికి రాగా ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకులు సన్మానించారు. నాయకులు కాటం రాజు తదితరులు పాల్గొన్నారు.
జైపూర్: గొల్ల, కుర్మల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గొర్రెల, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్, టూరిజం కార్పొరేషన్ చైర్మ న్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యాదవ శంఖా రావం సభకు హాజరుకాగా, వారిని ఎంపీటీసీ అరికె స్వర్ణ సంతోష్ యాదవ్, కొమ్ము అశోక్ యాదవ్ ఆధ్వ ర్యంలో సత్కరించి గొర్రె పిల్లలను బహూకరించారు. త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ ఉంటుందని తెలిపారు. కుల పెద్ద కొరివి రాజన్న, నాయకులు శ్రీకాంత్, లక్ష్మణ్, రమేష్, శేఖర్, వెంకటేష్ పాల్గొన్నారు.