ప్రజాపాలనతో అర్హత గల ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు
ABN , Publish Date - Dec 26 , 2023 | 09:47 PM
ప్రజా పాలన ద్వారా అర్హత గల ప్రతీ ఒక్కరికి క్షేత్ర స్ధాయిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 26: ప్రజా పాలన ద్వారా అర్హత గల ప్రతీ ఒక్కరికి క్షేత్ర స్ధాయిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు రాహుల్, మోతిలాల్, డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు, ఆర్డీవో హరికృష్ణ, జెడ్పీసీఈవో నరేందర్, డీఆర్‌డీవో శేషాద్రి, డీపీవో వెంకటేశ్వర్‌రావులతో కలిసి అధికారులు, తహసీల్దార్‌లు, మున్సిపల్ కమి షనర్‌లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పాలన అందించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్ర మాలు చేపడుతుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసు కొంటున్నామన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు కార్యక్రమం నిర్వహిస్తామని, గ్రామంలో, మున్సిపల్ వార్డులో కార్యక్రమం ఉంటుందని, ఇం దులో మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంది రమ్మ చేయూత పథకాలకు సంబంధించి దరఖా స్తులు స్వీకరిస్తామని తెలిపారు. మండల స్ధాయిలో అవసరమైన బృందాలను ఏర్పాటు చేసుకుని ప్రతీ బృందం 2 గ్రామాల్లో సభలు నిర్వహించాలని, జనవరి 6 నాటికి అన్ని గ్రామాల్లో సభలను పూర్తి చేయాలన్నారు. ప్రతీ బృందం గ్రామసభ, వార్డు సభల్లో కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతీ 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఉండేలా చూడా లన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక అధికారు లు సమావేశాలు నిర్వహించాలన్నారు. ముందు రోజే దరఖాస్తులు అందజేసి పూర్తి సమాచారం నింపే విధంగా అవగాహన కల్పించాలని, దరఖా స్తుల స్వీకరణలో స్ర్తీ, పురుషులకు వేర్వేరు క్యూలైన్‌లు, మహిళల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, తెల్లరేషన్‌కార్డు జతపర్చాలని తెలిపారు. దర ఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంఖ్యను కేటా యించాలని, దరఖాస్తుదారులకు రశీదులు అందిం చాలని తెలిపారు. సభల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారం టీ పథకాలను అర్హులకు అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సూచించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈవో, నోడల్ అధికారి నరేందర్ అధికారులకు ప్రజా పాలనపై అవగాహన కల్పించారు.