ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
ABN , First Publish Date - 2023-05-09T22:30:44+05:30 IST
ఇంటర్మీడియట్ ఫలి తాల్లో బాలికల హవా కొనసాగింది. గతేడాదితో పోలిస్తే జిల్లా లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. రెగ్యులర్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 5656 మంది హాజరు కాగా 3229 మంది ఉత్తీర్ణత సాధించారు.
మంచిర్యాల, మే 9 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ ఫలి తాల్లో బాలికల హవా కొనసాగింది. గతేడాదితో పోలిస్తే జిల్లా లో ఉత్తీర్ణత శాతం పెరిగింది. రెగ్యులర్ విభాగంలో ప్రథమ సంవత్సరంలో 5656 మంది హాజరు కాగా 3229 మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం ఫలితాలలో 57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 2616 మంది బాలురకు 1215 మంది, 3,040 మంది బాలికలకు 2014 మంది ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో 5910 మంది విద్యార్థులు హాజరు కాగా 3803 మంది ఉత్తీర్ణత సాధించగా 64 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో 2612 మంది బాలురకు 1454 మంది 3298 మంది బాలికలకు 2349 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 1254 మంది పరీక్షలకు హాజరు కాగా 666 మంది ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరంలో 53 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్ష రాసిన వారిలో 709 మంది బాలురకు 302 ఉత్తీర్ణత సాధించారు. 545 మంది బాలికలు హాజరు కాగా 364 మంది ఉత్తీర్ణుల య్యారు. ద్వితీయ సంవత్సరంలో 1138 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 853 మంది ఉత్తీర్ణతతో 75 శాతం నమోదైంది. పరీక్ష రాసిన వారిలో 622 మంది బాలురకు 412, 516 మంది బాలికలకు 441 మంది ఉత్తీర్ణులయ్యారు.
జనరల్ విభాగంలో ప్రైవేటుగా 895 మంది విద్యార్థులు హాజరు కాగా 223 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శా తం 24 నమోదైంది. ఒకేషనల్ విభాగంలో ప్రైవేటుగా మొత్తం 47 మంది హాజరు కాగా 28 మంది ఉత్తీర్ణులయ్యారు. 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పెరిగిన ఉత్తీర్ణత శాతం
గతేడాదితో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో 6 శాతం ఉత్తీ ర్ణత పెరిగింది. గత సంవత్సరం జిల్లాలో రెగ్యులర్, ఒకేషనల్ విభాగాల్లో 63 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా 2022-23 విద్యా సంవత్సరంలో ఆయా విభాగాల్లో 69 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో...
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 69 శాతం ఉత్తీర్ణత సాధించగా మోడల్ స్కూల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలల్లో 92 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు కళశాలల్లో 85 ఉత్తీర్ణత శతం నమోదైంది. కాసిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభిననదేవి 1000 మార్కులకు 962 మార్కులు , బైపీసీ విభాగంలో ఎం. అర్చిత 1000 మార్కులకు 975 మార్కులు సాధించారు. మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కలాశాల ఒకేషనల్‌విభాగంలో ఎంపీహెచ్‌డబ్య్లూ కోర్సులో ఆకుల శివ 500 మార్కులకు 495 మార్కులు సాధించి రాష్ట్రస్ధాయిలో ప్రథమ స్ధానంలో నిలిచాడు.