కుమరం భీం ఆసిఫాబాద్ నుంచే గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ
ABN , First Publish Date - 2023-06-26T22:54:44+05:30 IST
ఆసిఫాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఈనెల30వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లాపార్టీ అధ్యక్షుడు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపుని చ్చారు. ఈనెల 30న ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పట్టణంలోని ఓడ్డేపల్లి గార్డెన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
ఆసిఫాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఈనెల30వ తేదీ శుక్రవారం సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లాపార్టీ అధ్యక్షుడు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పిలుపుని చ్చారు. ఈనెల 30న ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పట్టణంలోని ఓడ్డేపల్లి గార్డెన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని తెలి పారు. అదేరోజు గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారని మంత్రి వెల్లడిం చారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముఖ్యమంత్రి పర్యటనను విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎంపీ గొడం నగేష్, జడ్పీ వైస్‌చైర్మన్ కోనేరు కృష్ణారావు, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, జిల్లా,మండలప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం..
- సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
ఎన్నో ఏళ్లుగా అడవినే నమ్ముకుంటూ వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్న పోడు వ్యవసాయదారు లకు పోడు హక్కును కల్పిస్తున్న ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు యావత్‌జిల్లా గిరిజనులందరి తరపున కృత జ్ఞతలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు.
సీఎం పర్యటనకు
అంతా సిద్ధంగా ఉండాలి
ఆసిఫాబాద్ రూరల్: ఈనెల 30న సీఎం కేసీఆర్ పర్యటన ఉన్నందున అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవనం, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలను కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సురేష్‌కుమార్, జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం పర్యటన ఖరారు అయినందున కార్యక్రమానికి సంబంధిత ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రక్షణ, భోజన వసతి, ట్రాఫిక్, తాగునీరు తదితర ఏర్పాట్లతో అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పర్యటన విజయవంతం చేసేదిశగా కృషి చేయాలని తెలిపారు. ఆయనవెంట జడ్పీటీసీ నాగేశ్వర్‌రావు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.