వైభవంగా గంగాదేవి జోనాల జాతర

ABN , First Publish Date - 2023-06-02T22:43:18+05:30 IST

ద్వారక గోదావరి ఒడ్డున గంగాదేవి ఆలయంలో శుక్ర వారం పెద్దపేట, ద్వారక గ్రామానికి చెందిన గంగపుత్ర సొసైటీ ఆధ్వర్యంలో జోనాల జాతర నిర్వహించారు. మహిళలు ఇండ్లలో వండిన నైవేద్యంతో బోనం ఎత్తుకోని డప్పుచప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు.

వైభవంగా గంగాదేవి జోనాల జాతర

దండేపల్లి, జూన్‌ 2: ద్వారక గోదావరి ఒడ్డున గంగాదేవి ఆలయంలో శుక్ర వారం పెద్దపేట, ద్వారక గ్రామానికి చెందిన గంగపుత్ర సొసైటీ ఆధ్వర్యంలో జోనాల జాతర నిర్వహించారు. మహిళలు ఇండ్లలో వండిన నైవేద్యంతో బోనం ఎత్తుకోని డప్పుచప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు. అనంతరం గోదావరి ఒడ్డున మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అధ్యక్షకార్యదర్శు లక్ష్మయ్య, పెద్దబొయిన రాజన్న, సంఘం నాయకులు కోటేష్‌, రావనవేని రవి, మల్లేష్‌, సత్తయ్య, శంకర్‌, రాజయ్య, స్వామి, ద్వారక, పెద్దపేట గ్రామాల గంగపుత్రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T22:43:18+05:30 IST