ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ABN , First Publish Date - 2023-01-26T01:36:51+05:30 IST

ప్రతి ఒక్కరు ఓట రుగా నమోదు చేసుకోవాలని 13వ జాతీయ ఓట రు దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్ర హం వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్‌ ముషా రఫ్‌ ఫారూఖీ జెండా ఊపి ప్రారంభించారు.

ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి
ర్యాలీని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ జెండా ఊపి ప్రారంభిస్తున్న దృశ్యం

నిర్మల్‌టౌన్‌, జనవరి 25 : ప్రతి ఒక్కరు ఓట రుగా నమోదు చేసుకోవాలని 13వ జాతీయ ఓట రు దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టర్‌ కార్యాలయం నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్ర హం వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్‌ ముషా రఫ్‌ ఫారూఖీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... 18 సంవ త్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం ఏడా దిలో 4 సార్లు అనగా జనవరి, ఏప్రిల్‌, జూలై, అక్టోబరు 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదుకు అవకాశం కల్పిం చడంతో పాటు 17 సంవత్సరాలు నిండిన యువ త కూడా ముందస్తుగా ఓటరుగా నమోదు చేసు కోవడానికి అవకాశం కల్పించిందని అన్నారు. అ నంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో అదనపు కలెక్టర్లు హేమంత్‌ బోర్కడే, రాంబాబు, డీఆర్‌వో లోకేష్‌, ఆర్‌డీవో స్రవంతి, డీఈవో రవీందర్‌, జిల్లా అధికారులు, విద్యార్థులు, ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులతో పాటు జిల్లా ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

‘కంటి వెలుగు’ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిర్మల్‌ రూరల్‌, జనవరి 25 : మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో బుధవారం రోజు కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, ఆయా శాఖల అధికారులు పా ల్గొన్నారు.

Updated Date - 2023-01-26T01:36:51+05:30 IST