చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి
ABN , First Publish Date - 2023-03-05T22:56:31+05:30 IST
చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని అదనపు న్యాయమూర్తి మైత్రేయి అన్నారు. నస్పూర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.సత్తయ్య ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.ఉదయ్‌కుమార్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చట్టాల పై అవగాహన కల్పించారు.
నస్పూర్, మార్చి 5: చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని అదనపు న్యాయమూర్తి మైత్రేయి అన్నారు. నస్పూర్ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.సత్తయ్య ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.ఉదయ్‌కుమార్ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చట్టాల పై అవగాహన కల్పించారు. మహిళలపై ప్రస్తుతం జరుగుతున్న అఘాయి త్యాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు పడే చట్టాలు ఉన్నాయన్నారు. అన్యాయానికి గురైన బాధితుల వివరాలను వెల్లడించకుండా జాగ్రత్తలు తీసుకోవడం, బాధితుల వివరాలను ఎఫ్‌ఐఆర్‌లో పేర్లు పొందుపరిచే విధా నంలో మార్పులు వచ్చాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సెల్‌ఫోన్లలో అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి ఇబ్బం దులకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి సంఘటనలతో మానసికంగా కృంగి పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అన్యాయాన్ని నిర్భయంగా ఎదుర్కొవాలని న్యాయమూర్తి మైత్రేయి సూచించారు. జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.ఉదయ్‌కుమార్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి అర్పితరెడ్డి, సీడీపీవో స్వరూపరాణి, రిసోర్స్‌పర్సన్స్ ప్రభంధిత, రజని, సఖి సంస్థ నిర్వాహకురాలు విజయ పాల్గొన్నారు.