Share News

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి

ABN , Publish Date - Dec 29 , 2023 | 10:06 PM

రానున్న పార్లమెం ట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం నాయ కులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు సూచించారు. శుక్రవా రం వేంపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాలులో నియోజక వర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపునకు కృషి చేయాలి

హాజీపూర్‌, డిసెంబరు 29: రానున్న పార్లమెం ట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం నాయ కులు, కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్‌రావు సూచించారు. శుక్రవా రం వేంపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాలులో నియోజక వర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజలకు నెరవేరని హామీలు ఇచ్చి గెలిచిందన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నిక ల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలన్నారు. యాసంగిలో రైతులు వరినాట్లు మొదలైనా రైతుబంధు వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజలు తిరగబడ తారని, ఇది దగ్గరలోనే ఉందన్నారు. ఎన్నికల ముం దు నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు మం జూరయ్యాయని, వాటితోనే కాంగ్రెస్‌ పనులు చేస్తుం దన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీని మోసం చేసిన నాయకు లకు సరైన గుణపాఠం చెప్పాలన్నారు.

Updated Date - Dec 29 , 2023 | 10:06 PM