‘డబుల్‌’ పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2023-02-14T01:19:02+05:30 IST

జిల్లాలో రెండు పడకల గదుల ఇళ్ళ నిర్మాణా లు, పురోగతి, లబ్దిదారుల ఎంపిక, గ్రామ సభల నిర్వహణ తదితర అంశాలపై తహసీల్దార్లు, ఇంజనీరింగ్‌ అధికారులతో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ సమావేశం నిర్వహించారు.

‘డబుల్‌’ పనులను వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణ

ఆదిలాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 13: జిల్లాలో రెండు పడకల గదుల ఇళ్ళ నిర్మాణా లు, పురోగతి, లబ్దిదారుల ఎంపిక, గ్రామ సభల నిర్వహణ తదితర అంశాలపై తహసీల్దార్లు, ఇంజనీరింగ్‌ అధికారులతో జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ సమావేశం నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో మండలాల వారీగా ఫిజికల్‌ ఇళ్ళ నిర్మాణాలు, లబ్దిదారుల దరఖా స్తులు, ఎంపికలపై తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్ట ర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించా రు. లబ్ధిదారుల జాబితా, గ్రామ సభలు నిర్వహణకు సంబంధించిన వివరాలు సమర్పించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ట్రైనీ సహాయ కలెక్టర్‌ పి.శ్రీజ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

‘సమస్య పరిష్కారంపై సమాధానం తెలపాలి’

ఆదిలాబాద్‌ టౌన్‌: ప్రజవాణిలో వచ్చిన ఆర్జీలను అఽధికారులు పరిశీలించి స మస్య పరిష్కారం అవుతుందో లేదో స్పష్టమైన సమాధానం ఆర్జీదారునికి తెలపా లని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణీలో వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్‌ స్వీకరించారు. పెన్షన్లు, దళిత బస్తీ, భూ సమస్యలు, రాజీవ్‌ స్వగృహ ఇళ్ళ పనులు, ఉపాధి తది తర సమస్యలపై కలెక్టర్‌ ఆర్జీలను స్వీకరించి, వారి పరిశీలన, పరిష్కారాలకు సం బంధిత శాఖ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జిదారుడి సమస్యను పరిశీలించాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని, పరిష్కారం అవుతుందా లేదా అనే విషయాన్ని దరఖాస్తుదారునికి రాత పూర్వకంగా తెలియజేయాలని అన్నారు. అంతకు ముందు ఆర్థిక ప్రయో జనాలపై భారతీయ రిజర్వు బ్యాంకు నిర్వహిస్తున్న వారోత్సవాలకు సంబంధిం చిన గోడ ప్రతులను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ ప్రజవావిణలో అదనపు కలెక్ట ర్లు నటరాజ్‌, రిజ్వాన్‌ భాషా షేక్‌, ట్రైనీ సహాయ కలెక్టర్‌ శ్రీజ, ఆర్డీవో రమేష్‌ రాథోడ్‌, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-14T01:19:04+05:30 IST