దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Dec 14 , 2023 | 10:12 PM
దివ్యాం గులు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠ శాల మైదానంలో జిల్లా స్ర్తీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలకు జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్యతో కలిసి హాజరై పోటీలను ప్రారంభించారు.
మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబరు 14: దివ్యాం గులు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠ శాల మైదానంలో జిల్లా స్ర్తీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలకు జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్యతో కలిసి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు అనేక రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, ఇదే స్ఫూర్తితో జిల్లాలోని దివ్యాంగులు ప్రభుత్వం కల్పి స్తున్న అవకాశాలను, పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈనెల 15న జిల్లా కేంద్రం లోని మైనార్టీ ఫంక్షన్‌హాలులో నిర్వహించనున్న అం తర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో బహుమ తులు ప్రదానం చేస్తామని తెలిపారు. అనంతరం క్రీడాకారులతో కలిసి చదరంగం, క్యారమ్ క్రీడలు ఆడారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, జిల్లా క్రీడా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, వయోజన విద్యాధికారి పురుషోత్తం, దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారా యణ, నాయకులు మహేందర్, తిరుపతి, సతీష్, భాగ్య తదితరులు పాల్గొన్నారు.