పిల్లల ఎదుగుదలకు నులిపురుగు నివారణ మాత్రలు దోహదం

ABN , First Publish Date - 2023-08-03T22:44:16+05:30 IST

పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎదగడానికి నులినురుగు నివారణ మాత్రలు దోహదం చేస్తాయని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. కస్తూర్బాగాంధీ పాఠశాలలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుబ్బ రాయుడితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పిల్లలకు మాత్రలను వేశారు.

పిల్లల ఎదుగుదలకు నులిపురుగు నివారణ మాత్రలు దోహదం

నస్పూర్‌, ఆగస్టు 3: పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎదగడానికి నులినురుగు నివారణ మాత్రలు దోహదం చేస్తాయని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. కస్తూర్బాగాంధీ పాఠశాలలో గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుబ్బ రాయుడితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పిల్లలకు మాత్రలను వేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగుల నివార ణకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. జిల్లాలో 2090 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళా శాలల్లో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సుల గల విద్యార్థులు 1,94,282 మంది ఉన్నారన్నారు. పిల్లలకు మాత్రలు ఇచ్చే సమ యంలో వారికి నిర్థేశించిన మోతాదులో ఇవ్వాలని, అంగన్‌ వాడి, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు తమతమ పరిధిలో పిల్లలను గుర్తించి మాత్రలను ఇవ్వాలన్నారు. కళ్ళ కలక సమస్యతో బాధపడుతున్న వారు సమస్య తగ్గిన తరువాత మాత్రలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచిం చారు. డాక్టర్‌ ఫయాజ్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అనిత, ఉప వైధ్యాధికారులు విజయ పూర్ణిమా, విజయనిర్మల, పీహెచ్‌సీ వైద్యురాలు సమత, జిల్లా మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, సీడిపిఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-03T22:44:16+05:30 IST