మారుమూల గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ABN , First Publish Date - 2023-02-21T22:23:31+05:30 IST
మారుమూల గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు
బెజ్జూరు, ఫిబ్రవరి 21: మారుమూల గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండలంలోని సలుగుపల్లి- సులుగుపల్లి, సలుగుపల్లి- బారెగూడ మధ్య రెండు వంతెనల నిర్మాణం కోసం రూ.5.11 కోట్లు మంజూరు కాగా మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. యేటా వర్షాకాలంలో కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వంతెనల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ప్రతి గ్రామానికీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు కు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ ఓం ప్రకాష్, కో ఆప్షన్ సభ్యుడు బషరత్‌ఖాన్, నా యకులు సకారాం, వెంకన్న, సతీష్, పెంటయ్య, నరేందర్‌గౌడ్, జాయి ద్ హుస్సేన్, రవీందర్‌గౌడ్, రమేశ్, షౌకత్, సర్పంచ్‌లు రవి, హన్మం తు, ఎంపీటీసీ శ్రీనివాస్, వెంకన్న పాల్గొన్నారు.