కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
ABN , First Publish Date - 2023-05-25T23:10:28+05:30 IST
కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు.

దండేపల్లి, మే 25: కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని గూడెంలో ఆమె పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసగిస్తున్నా యని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్లను ఇంటింటా ప్రజలకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు తోట మోహన్, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ అక్కల శకుంతల, తదితరులు పాల్గొన్నారు.