కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
ABN , First Publish Date - 2023-08-02T22:38:25+05:30 IST
కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.
ఏసీసీ, ఆగస్టు 2 : కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల 8వ వార్డులో బుధవారం గడప గడపకు పీఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపు చేయలేకపోతున్నాయన్నారు. కూరగాయలు, బియ్యం, ఉప్పు, పప్పుల ధరలు ఆకాశాన్నంటి సామాన్యుడి ఇల్లు గడవడమే భారంగా మారిందని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, రైతుల రుణ మాఫీ, తదితర హామీలను తుంగలో తొక్కిందన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం దేశ సంపదను అప్పనంగా కార్పొరేట్లకు దోచి పెడుతూ సామాన్యులపై అధిక పన్నుల భారం మోపుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుందని తదెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అద్యక్షుడు తూముల నరేష్, పెంట రజీత, బొల్లం భీమయ్య, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.