డెంగీపై అవగాహన ర్యాలీ

ABN , First Publish Date - 2023-05-16T23:15:09+05:30 IST

జాతీయ డెంగీ వ్యాధి నివారణ దినం సందర్భంగా మంగళవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్యాధికారి రామకృష్ణ ప్రారంభించారు.

డెంగీపై అవగాహన ర్యాలీ
ఆసిఫాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

ఆసిఫాబాద్‌, మే 16: జాతీయ డెంగీ వ్యాధి నివారణ దినం సందర్భంగా మంగళవారం నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్యాధికారి రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ వినోద్‌, డాక్టర్‌ అమ న్‌, డాక్టర్‌ హర్షవర్దన్‌, జిల్లా ఆరోగ్య బోధకులు ఎండీ రషీద్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

బెజ్జూరు: డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ సుంకన్న అన్నారు. మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది దిలీప్‌, అయేషా, సునీత, మంజుల, మేఘన, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-16T23:15:09+05:30 IST