ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి

ABN , First Publish Date - 2023-09-19T22:29:32+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా వైద్యు లు, సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం తాళ్ళపేట, దండేపల్లి పీహెచ్‌సీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి

దండేపల్లి, సెప్టెంబరు 19: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా వైద్యు లు, సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు సూచించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం తాళ్ళపేట, దండేపల్లి పీహెచ్‌సీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గర్భిణులు సల హాలు, సూచనలు ఇస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేలా చూడాలన్నారు. ప్రభు త్వం అందిస్తున్న కేసీఆర్‌ కిట్‌ గురించి వారికి తెలియజేయాలన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు చేయాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహి స్తేనే ప్రజలకు మనపై విశ్వాసం పెరుగుతుందన్నారు. జిల్లా టీబీ ప్రోగామ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఫజాయఖాన్‌, డాక్టర్‌ శివప్రతాప్‌, డా, సతీష్‌, డా. కాంత్రికుమార్‌ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జన్నారం: ఆరోగ్య మహిళ కేంద్రాలను ప్రజలు సద్వనియోగం చేసుకోవాలని డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు పేర్కొన్నారు. పీహెచ్‌సీలో నిర్వహిస్తున్న మహిళ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ప్రభు త్వం ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలను చేస్తుందని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏఎన్‌ఎంలు ప్రభుత్వ ఆసుపత్రిల్లో డెలివరీలు జరిగేలా చూడాలన్నారు. సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వైద్యురాలు ఉమాశ్రీ, సిబ్బంది రమేష్‌, సుశీల, చంద్రలీల పాల్గొన్నారు.

Updated Date - 2023-09-19T22:29:32+05:30 IST