ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు

ABN , First Publish Date - 2023-06-02T22:46:02+05:30 IST

ఏం సాధిం చారని రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశాబ్ది ఉత్స వాలు నిర్వహిస్తుందని ఆలిండియా ఆదివాసీ కాం గ్రెస్‌ వైస్‌ చైర్మన్‌, లంబాడి హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్‌ ప్రశ్నించారు.

ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు

మంచిర్యాల, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఏం సాధిం చారని రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశాబ్ది ఉత్స వాలు నిర్వహిస్తుందని ఆలిండియా ఆదివాసీ కాం గ్రెస్‌ వైస్‌ చైర్మన్‌, లంబాడి హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్‌ ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకు డు కేవీ ప్రతాప్‌ అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఆయన మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రజలు సంతోషంగా లేరన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు లేదని, ముఖ్య మంత్రి కేసీఆర్‌ వారిని పట్టించుకోవడం లేదని ఆరో పించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన కేసీఆర్‌ ఇక్కడి సంపదనంతా వారికి దోచిపెడుతున్నాడని విమర్శిం చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రో ళ్లకు ఏజెంట్లుగా పని చేసిన వారంతా బీఆర్‌ఎస్‌లో చేరి దోపిడీకి పాల్పడు తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బాగుపడ్డది కేసీఆర్‌ కుటుంబమేనని, ప్రజలకు జరిగిన మేలేదిలేద న్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ తెలం గాణ వస్తే బతుకులు మారుతాయని సబ్బండ వర్ణాలు భావించాయని, కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం మొత్తం చచ్చుబడిపోయిందని ఎద్దేవా చేశారు. వేల ఎకరాల్లో పంటలు, ప్రజల ఇళ్లు మునిగిపోతే ఒక్క సారి కూడా చూడని ముఖ్యమంత్రి ప్రజల కష్టాలు ఎలా తీరు స్తాడని ప్రశ్నించారు. మోదీ అడుగులకు మడుగులొత్తడం తప్ప, రాష్ట్రానికి మీరు చేసిన మేలేంటో చెప్పాలని డిమాం డ్‌ చేశారు. సీనియర్‌ నాయకుడు కేవీ ప్రతాప్‌ మాట్లాడు తూ తెలంగాణ ఉద్యమంలో తాను ప్రధాన పాత్ర పోషిం చినందుకే సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాం గ్రెస్‌ పార్టీ బలోపేతానికి పాటుపడుతున్న తాను ప్రజల కు దగ్గర ఉండాలనే క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ట్లు తెలిపారు. జాతీయ పతాకావిష్కరణ చేసిన నాయకులు, అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి సోనియా గాంధీ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ప్రతాప్‌ నివాసంలో రాజీవ్‌గాంధీ హెల్త్‌ సెంటర్‌ను ప్రారంభించారు. దుర్గం భాస్కర్‌, గొమాస శ్రీనివాస్‌, డాక్టర్‌ నీలకంఠేశ్వర్‌రావు, టీపీసీసీ ఓబీసీ చైర్మన్‌ కత్తి వెంకటస్వామి, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌, నాయకులు దీటి రవి, ఒడ్నాల శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-02T22:46:02+05:30 IST