దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి : జడ్పీ సీఈవో
ABN , First Publish Date - 2023-05-27T01:52:06+05:30 IST
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాలను ఘనంగా నిర్వహించాలని జడ్పీ సీఈవో సుధీ ర్ అన్నారు.

దస్తూరాబాద్, మే 26 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాలను ఘనంగా నిర్వహించాలని జడ్పీ సీఈవో సుధీ ర్ అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరి శీలించి రికార్డులన్నీ సక్రమంగా ఉండాలని సిబ్బందికి సూ చించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. అదే విధంగా జూన్ 19 తేదీల్లో 1500ల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామాల్లో వెయ్యి మొక్కలు, 1500ల కంటే తక్కువ ఉన్న గ్రామాల్లో 500ల మొక్కలు నాటేలా చూడాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో విజయ్ భాస్కర్‌రెడ్డి, ఈజీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.