నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

ABN , First Publish Date - 2023-06-02T22:44:53+05:30 IST

తాండూర్‌ గ్రామపంచాయతీ శివారులో శుక్రవారం 15 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు మండల వ్యవసాయాధికారి కిరణ్మ యి తెలిపారు.

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

తాండూర్‌, జూన్‌ 2: తాండూర్‌ గ్రామపంచాయతీ శివారులో శుక్రవారం 15 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు మండల వ్యవసాయాధికారి కిరణ్మ యి తెలిపారు. తాండూర్‌కు చెందిన అల్లి నారాయణ నకిలీ పత్తి విత్తనాలు తీసుకువస్తున్నట్లు విజిలెన్స్‌ సమాచారం మేరకు అడిషనల్‌ సూపరింటెండెంట్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రామారావు ఆదేశాల మేరకు విజిలెన్స్‌ అధికారులు, వ్యవసాయ అధికారులు పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న 15 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు. బెల్లంపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు సురేఖ, ఎన్‌ఫోర్స్‌మెం ట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అనిల్‌ కుమార్‌, ఐఓబి విజిలెన్స్‌ డి.వరుణ్‌ ప్రమోద్‌, తహసీల్దార్‌ విజిలెన్స్‌ ఏ.దినేష్‌ చంద్ర, అనిల్‌ కుమార్‌. సంపత్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - 2023-06-02T22:44:53+05:30 IST