అడవుల సంరక్షణ అందరి బాధ్యత

ABN , First Publish Date - 2023-04-03T22:51:11+05:30 IST

అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని, ప్రతీఒక్కరు అడవులతోపాటు వన్య ప్రాణులను రక్షించాలని చీఫ్‌ కన్జర్వే టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. సోమ వారం ముత్యంపల్లి, ధర్మారావుపేట అటవీ సెక్షన్‌ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు.

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

కాసిపేట, ఏప్రిల్‌ 3: అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని, ప్రతీఒక్కరు అడవులతోపాటు వన్య ప్రాణులను రక్షించాలని చీఫ్‌ కన్జర్వే టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. సోమ వారం ముత్యంపల్లి, ధర్మారావుపేట అటవీ సెక్షన్‌ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో వన్య ప్రాణులు తాగునీరు లభించక జనావాసాల్లోకి వచ్చి ప్రమాదాల బారిన పడతా యని, అడవుల్లో నీటి కుంటలు, నీటి తొట్టెలు, పక్షులు నివసించడానికి ఆవా సాలను ఏర్పాటు చేయాలన్నారు. అక్రమ కలప రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అడవుల సంరక్షణ వల్లనే వాతావరణం సమతుల్యంగా ఉంటుందని, అడవులను కాపాడడంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. వన్య ప్రాణులను వేటాడవద్దని గిరిజన గూడాల రైతులకు సూచించారు. డీఎఫ్‌వో శివ్‌ఆశిష్‌సింగ్‌, ఎఫ్‌డీవో వినయ్‌కుమార్‌ సాహూ, ఎఫ్‌ఆర్‌వో సుభాష్‌, డిప్యూటీఆర్‌వో ప్రవీణ్‌నాయక్‌, ఎఫ్‌బీవోపాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T22:51:11+05:30 IST