కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు మేలు

ABN , First Publish Date - 2023-05-26T22:38:04+05:30 IST

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ (డీసీసీ) అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అన్నారు.

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు మేలు
నంబాలలో రైతులతో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షురాలు సురేఖ.

దండేపల్లి, మే 26: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ (డీసీసీ) అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ-ప్రేంసాగర్‌రావు అన్నారు. మండలం లోని నంబాలలో గడప గడపకు కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలో శుక్రవారం ఆమె ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. పలువురు రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పాలనలో అంతా అవినీతిమయమైందని చెప్పారు. సంక్షేమ పథకాల పేరిట సీఎం కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే రైతులందరికి 2లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తుందన్నారు. రైతు సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తుందని చెప్పారు. ఇందిరమ్మ రైతు భరోసా పేరుతో రైతులకు ఎకరాకు 15వేలు, భూమిలేని రైతు కూలీలకు ఎడాదికి 12వేల రూపాయలు కాంగ్రెస్‌ పార్టీ అందజేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నిక ల్లో కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరించి, ప్రేమ్‌సాగర్‌రావును అఽధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షు రాలు పెంట రజిత, మాజీ ఎంపీపీ అక్కల శకుంతల, సర్పంచు గోపతి పుష్పలత, నాయకులు గోపతి రాకేష్‌, లచ్చన్న పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T22:38:04+05:30 IST