రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ABN , First Publish Date - 2023-09-20T01:13:47+05:30 IST

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభు త్వమేనని సీడబ్ల్యూసీ సభ్యులు, ఉత్తరాఖండ్‌ పీసీసీ మాజీ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే గోదియాల్‌ గణేష్‌ అన్నారు.

రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే
ఖానాపూర్‌లో మాట్లాడుతున్న గోదియాల్‌ గణేష్‌

కాంగ్రెస్‌ ఉత్తరాఖండ్‌ ఎమ్మెల్యే గోదియాల్‌ గణేష్‌

ఖానాపూర్‌, సెప్టెంబరు 19 : తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభు త్వమేనని సీడబ్ల్యూసీ సభ్యులు, ఉత్తరాఖండ్‌ పీసీసీ మాజీ అఽధ్యక్షుడు, ఎమ్మెల్యే గోదియాల్‌ గణేష్‌ అన్నారు. సోమవారం ఖానాపూర్‌ పట్టణం లోని జేకే ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెసేనన్నారు. తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ లను అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీని గెలిపించే దిశగా కార్యకర్తలంతా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజ లంతా కలిసి బీఆర్‌ఎస్‌ పాలనతో విసుగు చెందారని త్వరలోనే ఆ పార్టీని ప్రజలే భూస్థాపితం చేస్తారన్నారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రె స్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు విభేదాలను పక్కనపెట్టి కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. సమిష్టిగా శ్రమిస్తే ఇక్కడ విజయం ఖాయ మన్నారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమా వేశంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ భొజ్జు పటేల్‌, ఉట్నూర్‌ జడ్పీటీసీ రాథోడ్‌ చారులత, టీపీసీసీ గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భరత్‌ చౌహాన్‌, నియోజకవర్గ నాయకులు చంద్రశేఖర్‌ రాథోడ్‌, బక్షినాయక్‌, రాంకిషన్‌ నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు దొనికెని దయానంద్‌, పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కడార్ల గంగ నర్సయ్య, సునీల్‌ జాదవ్‌, జహీర్‌, యూసుఫ్‌ ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T01:13:47+05:30 IST