కాంగ్రెస్‌లో కలవరం

ABN , First Publish Date - 2023-03-19T00:27:34+05:30 IST

ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.

కాంగ్రెస్‌లో కలవరం
ఇటీవల నిర్మల్‌లో పాదయాత్ర నిర్వహించిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (ఫైల్‌)

భట్టి పాదయాత్రకు గైర్హాజరుపై సర్వత్రా ఉత్కంఠ

పార్టీ నేతల్లో గైర్హాజరుపై చర్చ

నిర్మల్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన మహేశ్వర్‌రెడ్డి.. మొదటినుంచి అంతటా అనుచవర్గాన్ని కలిగి ఉన్నారు. అనంతరం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మరింత వేగం అందుకుంది. అటు రాష్ట్రస్థాయిలోనూ తనకంటూ ప్రత్యేకతను తెచ్చుకున్న మహేశ్వర్‌రెడ్డి.. జిల్లాలో కూడా పార్టీ ఉనికిని కాపాడే దిశగా పావులు కదుపుతున్నారు. పార్టీపరంగా బిజీగా మారిపోవడమే కాకుండా మారిన పరిస్థితుల నేపథ్యంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డితో సైతం విభేధిస్తూ వస్తున్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే ఆయన చేత నిర్మల్‌లో మహేశ్వర్‌రెడ్డి పట్టుబట్టి పాదయాత్రను నిర్వహింపజేశారు. ఆ తర్వాత రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిని మహేశ్వర్‌ రెడ్డి విభేధించడం మొదలుపెట్టారు. చిలికి చిలికి గాలివానలాగా ఈ పరిణామం వీరిద్దరి మఽధ్య విభేధాల తీవ్రతకు కారణమైంది. అయితే మహేశ్వర్‌రెడ్డి ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ హోదాలో రేవంత్‌రెడ్డి పాదయాత్రపై చేసిన వ్యాఖ్యలు సైతం రాజ కీయంగా దుమారం రేపాయి. రేవంత్‌రెడ్డి పాదయాత్ర విషయంలో అధిష్టానం ఓ తీరుగా.. పార్టీలోని ఓ వర్గం మరో తీరుగా స్పందించడం కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే మహేశ్వర్‌రెడ్డి మాజీ పీసీసీ అఽధ్యక్షుడు ఉత్తం కుమార్‌ రెడ్డితో సఖ్యతగా ఉంటూ రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గంగా ఏర్పడ్డారన్న ప్రచారం మొదలైంది. అయితే రేవంత్‌రెడ్డి పాదయాత్రలో మహేశ్వర్‌రెడ్డి పాల్గొనకపోవడం కూడా ఆ పార్టీలో విబేధాలకు సాక్ష్యంగా పేర్కొంటున్నారు. అంతటితో ఆగకుండా మహేశ్వర్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను లక్ష్యంగా చేసుకొని పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహేశ్వర్‌రెడ్డి పాదయాత్ర కార్యక్రమానికి పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తం కుమార్‌ రెడ్డి, పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు తదితర నాయకుౄలంతా పాల్గొన్నారు. నిర్మల్‌ జిల్లాలో రెండు రోజుల పాటు మహేశ్వర్‌రెడ్డి యాత్రను కొనసాగించారు. ఆ తరువాత ఆయన పాదయాత్ర అనూహ్యంగా నిలిచిపోవడంతో భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. ఢిల్లీ అధిష్టానం ఆదేశాల మేరకే మహేశ్వర్‌ రెడ్డి తన పాదయాత్రను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు రేవంత్‌రెడ్డితో విభేధించిన మహేశ్వర్‌ రెడ్డి తన పాదయాత్ర నిలిపివేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధిష్టానానికి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాలతో కలిసి మెలిసి ఉంటున్న భట్టి విక్రమార్క ఆదిలాబాద్‌ జిల్లాలోని ఇచ్చోడ నుంచి పాదయాత్ర చేపట్టారు. మూడు రోజుల క్రితం భట్టి విక్రమార్క పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొదలైౄనప్పటికీ.. ఆ పాదయాత్రలో మహేశ్వర్‌ రెడ్డి పాల్గొనకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. మహేశ్వర్‌ రెడ్డి పాదయాత్రలో భట్టి విక్రమార్క పాల్గొనౄప్పటికీ.. ఆయన పాదయాత్రలో మాత్రం మహేశ్వర్‌రెడ్డి పాల్గొనకపోవడం వెనక కారణాలు ఏవై ఉంటాయన్న చర్చకు దారి తీసింది. రోజురోజుకూ అటు రాష్ట్ర కాంగ్రెస్‌లో, జిల్లా కాంగ్రెస్‌లో పరిణామాలు మారుతుౄన్నప్పటికీ.. మహేశ్వర్‌ రెడ్డి అంతరంగం మాత్రం ఎవరికీ అంతు పట్టడం లేదు. మహేశ్వర్‌ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు ౄదారి తీయవచ్చోౄనన్న ఉత్కంఠ జిల్లాలో మొదలైంది.

Updated Date - 2023-03-19T00:27:34+05:30 IST