ఆదివాసీల సంగమం.. నాగోబా సంబరం

ABN , First Publish Date - 2023-01-21T00:11:04+05:30 IST

అడవి తల్లి ఒడిలో నివసించే ఆదివాసీ తెగలు జరుపుకోనే పండులు ఎన్నో ఉంటాయి.

ఆదివాసీల సంగమం.. నాగోబా సంబరం
దేదీప్యమానంగా వెలిగిపోతున్న నాగోబా ఆలయం

నేడు రాత్రి నాగోబాకు మహాపూజ

ప్రారంభించనున్న మెస్రం వంశీయులు

24న నాగోబా దర్బార్‌

ఇంద్రవెల్లి, జనవరి 20: అడవి తల్లి ఒడిలో నివసించే ఆదివాసీ తెగలు జరుపుకోనే పండులు ఎన్నో ఉంటాయి. కానీ రాష్ట్ర పండుగగా పేరుపొందిన ఆదివాసీ ల ఆరాధ్య దైవం కేస్లాపూర్‌ నాగోబా జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఆదివాసీ గి రిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారావ్యవహారాలకు నిలువెత్తు నిదర్శనమని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రకృతిని పూజిస్తూ దేశంలోనే రెండో అతి పెద్ద ఆది వాసీ గిరిజన జాతర. 15 రోజుల పాటు జరిగే ఈ ఆదివాసీ గిరిజనుల పండుగ ను మెస్రం వంశీయులు ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు. మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా జాతర శనివారం అర్థరాత్రి మెస్రం వంశీయులు ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభం కానుంది. ఇప్పటికే మెస్రం వంశీయు లు జన్నారం మండలం హస్తినమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకువచ్చి ఆలయ సమీపంలోని మర్రిచెట్ల కింద సేదతీరారు. వారం పాటు జాతర కొనసాగనున్నది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర తర్వాత రెండో అతి పెద్దదైన జాతర కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, మద్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, ఒడిస్సా, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

పవిత్ర గంగాజలంతో అభిషేకం

అమావాస్య రోజు అర్ధరాత్రి ఆరాధ్య దైవం నాగోబాకు గంగాజలంతో జలాభిషే కం చేసి మెస్రం వంశీయులే మహాపూజలు నిర్వహిస్తారు. ఈ నాగోబా జాతరకు 550 ఏళ్ల కిత్రం మర్రిచెట్టు నీడన వెలసిన శేషనారాయణుడిగా పేరున్న నాగదేవతకు మొక్కలు చెల్లించడం ద్వారా పంటలు సమృద్ధిగా పండి తమ కోర్కెలు నెరవేరుతాయని ప్రతీక. తరతరాలుగా ఆదివాసీ కుటుంబాలన్ని తరలివచ్చి నాగోబా సన్నిధిలోని మర్రిచెట్టు నీడన సేదతీరుతారు. జొన్నలు, మొక్కజొన్నలతో తయా రు చేసిన వరి అన్నిం, గటక, సాంబారును ప్రత్యేకంగా తమ ఇలవేల్పునకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ జాతరకు ఎడ్లబండ్లపై రావడం పండగ నియమంగా ఆదివాసీలు భావించడం విశిష్టత. వారం పాటు జరిగే జాతర ఉత్సవాల్లో భాగం గా మెస్రం వంశీయుల్లోని 22 తెగలకు చెందిన ఆదివాసీలు మృతి చెందిన పితృదేవతలకు కర్మకాండాలు(తూమ్‌) నిర్వహించడం ఆనవాయితీ. అక్కడ వెలిసిన స్థలాన్ని నాగోబా దేవతకు పూజలందుకుంటుంది. ఈ జాతర ఉత్సవాల్లో భాగం గా శనివారం తొలిరోజు ఆదివాసీల సంప్రదాయ వాయిధ్యాలతో నాగోబా ఆల యంలోకి ప్రవేశించి మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో అర్ధరాత్రి మహాపూజ నిర్వహిస్తారు. మెస్రం వంశ ఆడపడుచులు, అల్లుల్లు ప్రత్యేకంగా దేవత పుట్టలను తయారుచేసి ఐదు రోజుల పాటు అక్కడే వివిధ కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకోనున్నారు. మెస్రం వంశంలోని కొత్తకోడళ్లు నాగోబా సన్నిధి లో బేటింగ్‌ కావడం ఇక్కడి ప్రత్యేకత. వివిధ రాష్ట్రాల నుంచి మెస్రం వంశానికి చెందిన కొత్తకోడళ్లు కుల పెద్దలు ఇక్కడికి చేరుకోవడంతో జాతర ఉత్సవాలు ప్రా రంభమవుతాయి. ఈనెల 23న పెర్సాపన్‌తో పాటు బాన్‌పేన్‌ పూజలు నిర్వహిస్తారు. అయితే నిజాం కాలంలో 50 వేల మందిపైనే ఈ జాతకు ఆదివాసీలు తరలి రావడంతో అప్పటి మానవ పరిణామ శాస్త్రవేత్త హైమన్‌డార్ప్‌ సిఫారసు మేరకు ప్రభుత్వం ఇక్కడ గిరిజన దర్బార్‌ నిర్వహించి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి వేదిగకగా ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గిరిజనుల చెంతకే దర్బార్‌కు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై సమస్యలను ఆలకించి వినతుల పై హామీలు ఇవ్వడం అనవాయితీ. గిరిజన దర్బార్‌ జాతర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు.

కొత్తకుండల్లో కోనేరు నీరు

నాగోబా మహాపూజ సందర్శంగా సిరికోండ నుంచి తెచ్చిన కొత్తకుండల్లో మెస్రం ఆడపడచుల ఆధ్వర్యంలో మర్రి చెట్టు వద్ద ఉన్న కోనేరు నుంచి కొత్త కుండల్లో నీళ్లు తెచ్చి ఆలయాన్ని శుద్ది చేస్తారు. నాగోబా పూజల అనంతరం మర్రిచెట్టు వద్ద ఉన్న మెస్రం గిరిజనులందరు గోవ్వాడ్‌కు చేరుకుంటారు.

కొత్త కోడళ్ల బేటింగ్‌ ప్రత్యేకత

మెస్రం గిరిజనులను పెళ్లాడిన కొత్తకొడళ్లు నాగోబా దేవత బేటింగ్‌కు ప్రత్యేకం గా నాగోబా జాతరకు తరలి వస్తారు. నాగోబా దేవుని దర్శనంకు ప్రతి కొత్త కోడ ళ్లు రావాల్సి ఉంటుంది. బేటింగ్‌ తరువాతనే తమ కులస్తులకు కూడ పరిచయం చేస్తారు. నూతన వదువులు ఇంటి నుంచి ఎడ్లబండి వెనుక వెదురు గుళ్లలు పట్టుకుని కాలినడకన బయలుదేరి వస్తారు. పరిచయం కావాల్సిన వదువులను బేటి కోరియాడ్‌ అని అంటారు. ఇద్దరేసి వంతున జతలు చేసి ముఖం నిండ తెల్లటి దుస్తులతో ముసుగు వేస్తారు. పూజా కార్యక్రమానికి ముందు నాగోబా దేవుని దగ్గరికి తీసుక వెళ్లి పరిచయం చేస్తారు.

Updated Date - 2023-01-21T00:11:07+05:30 IST