డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల అర్హులపై గ్రామసభ నిర్వహించండి
ABN , First Publish Date - 2023-01-05T01:41:43+05:30 IST
నిర్మల్‌లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి గ్రామసభ ఏ ర్పాటు చేయాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదే శించారు.
నిర్మల్ కల్చరల్, జనవరి 4 : నిర్మల్‌లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి గ్రామసభ ఏ ర్పాటు చేయాలని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదే శించారు. బుధవారం ఆయన డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, నూతన కలెక్టరే ట్ రోడ్డు పనులు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జిల్లాలోని వివిధ గ్రా మాల్లో జరుగుతున్న శానిటేషన్ పనుల గురించి అడిగి తెలుసు కు న్నారు. గ్రామాల్లోని తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పల్లెప్రకృతి వనా లు ఎంత వరకు పూర్తయ్యాయని ప్రశ్నించారు. అందుకు సంబం ధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో శానిటేషన్ పనుల నిర్వహణపై నిర్లక్ష్యం కూడదని అధికారులను హెచ్చరించారు. డబుల్ బెడ్ రూమ్‌లకు అన్ని హంగులు కల్పించా లని, కలరింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో విజయ లక్ష్మి, ఎంపీడీవోలు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్లు, ఎంపీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.